పక్కింట్లో శవం ఉంటే…సంబరాలు చేసుకుంటారా?

పక్కింట్లో శవం ఉంటే…సంబరాలు చేసుకుంటారా?
March 21 20:57 2018

కరీంనగర్
రిజర్వేషన్ అంశాన్ని తేల్చాల్సి ఉందంటున్న టీఆర్ఎస్ ఎంపీలపై మాజీ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. నిజంగా ముస్లింల రిజర్వేషన్లపై టీఆర్ఎస్‌కు చిత్త శుద్ధి ఉంటే మూడేళ్లుగా కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఆడిస్తున్న నాటకంలో టీఆర్ఎస్ పాత్రధారిగా ఉందని, కేంద్రం అవిశ్వాసం నుంచి తప్పించుకోడానికి ఆడుతున్న నాటకమని పొన్నం ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి మూడేళ్లు అయిందని, ప్రధాని 50 శాతం కోటా దాటదని చెబుతుంటే… ఎన్నడు మాట్లాడని వ్యక్తి ఈ సెషన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి రిజర్వేషన్ కారణం చూపించి అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకుంటున్నారని పొన్నం టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. అమ్మ పెట్టదు… అడుక్కోనివ్వదన్నట్టు గా టీఆర్ఎస్ విభజన హామీల గురించి మాట్లాడదని విమర్శించారు. ఏపీ హామీలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుంటే…టీఆర్ఎస్ కేంద్రంతో లోపాయకారి ఒప్పందంతో… పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టినప్పుడల్లా రిజర్వేషన్ వంకతో అడ్డుకుంటున్నారని పొన్నం మండిపడ్డారు.ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వని టీఆర్ఎస్ తీరును పొన్నం తప్పుపట్టారు. పక్కింట్లో పెళ్లి అయితే… మనింట్లో రంగులు వేసుకుంటామా, అన్న నర్సయ్యగౌడ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. పక్కింట్లో శవం ఉంటే… డప్పు కొట్టి సంబరాలు చేసుకుంటారా, అంటూ ప్రశ్నించారు. హోదా ఇచ్చి, విభజన హామీలు నెరవేరుస్తామని బీజేపీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాన తర్వాత అమలు చేయనప్పుడు ఏపీకి నైతికంగా పక్కింటివారిగా మద్దతు ఇవ్వాలని పొన్నం అన్నారు. టీఆర్ఎస్ తీరు మంచిదికాదని, మనతో 60 ఏళ్లు కలిసి ఉండి విడిపోయిన అన్నదమ్ములని, వాళ్లు విభజన హామీలు అడుగుతున్నారని, నీ అయ్య సొత్తు అడగడంలేదని, పార్టీ హక్కును అడగడంలేదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20431
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author