సక్సెస్ అవుతున్న ఈ పాస్ విధానం

సక్సెస్ అవుతున్న ఈ పాస్ విధానం
March 22 11:30 2018

వరంగల్,
రేషన్ షాపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సర్కారు అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం విజయవంతమైంది. లబ్ధ్దిదారుల వేలిముద్రలతో సరుకులు తీసుకొని ఒక్క గ్రాము కూడా తక్కువగా రాకుండా తూకం వేసి ఇస్తున్న ఈ-పాస్‌ని భేష్ అంటున్నారు. దీంతో డీలర్ల అక్రమాలకు కళ్లెం పడి పారదర్శకత పెరిగింది. సెప్టెంబర్ నుంచి దుకాణాల్లో పకడ్బందీగా ఈ-పాస్‌ను అమలు అమలు చేస్తుండటంతో రూరల్ జిల్లాలో బహిరంగ మార్కెట్ విలువతో చూస్తే రూ.6.50 కోట్ల బియ్యం మిగులు రావడం గమనార్హం. అంతేగాకుండా ప్రతి నెల 15 వరకు రేషన్ సరుకులు ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన అధికారులు ఆ తర్వాత ఈ-పాస్ పని చేయదని చెబుతున్నారు. ఈ-పాస్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలో లబ్ధ్దిదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునేలా ఫోర్టబులిటిని అమల్లోకి తెస్తుందని సంబంధిత అధికారులు ప్రకటించడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లాలో 15 మండ లాలు ఉండగా వాటి పరిధిలో 464 చౌక దుకాణాలు ఉన్నాయి. మొత్తంగా 2,18,196 రేషన్ కార్డులున్నాయి. వీటి ల్లో అంత్యోదయ 12179, ఆహార భద్రత కార్డులు 20,6012, అన్నపూర్ణ కార్డులు 15 ఉన్నట్లు అధికారులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీలో పూర్తి పారదర్శకతను తీసుకొచ్చింది. పేదలకు అందిస్తున్న ప్రతి గింజ వారికే దక్కాలన్న కృత నిశ్చయంతో ఈ-పాస్‌ను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం పే దలకు రూపాయికి బియ్యంతో పాటు కిరోసిన్‌ను చౌక దుకా ణాల నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రతి లబ్ధ్దిదారుడి ఆధార్ నెంబర్‌ను అను సంధానం చేశారు. వేలి ముద్రలను, ఫోన్ నంబర్ల తీసుకుని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను డీలర్లకు అందించి గత సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్నారు. ప్రతి డీలర్ ఈ-పాస్ మిషన్ల ద్వారానే పంపిణీ చేస్తున్నారు. దీంతో బియ్యం వంటి సరుకులు పక్కదారి పట్ట కుండా చేశారు. లబ్ధిదారుడి కుటుంబంలో ఒక్కరైనా దుకాణానికి వచ్చి వేలిముద్రలు వేస్తేనే సురుకులు విడుదల అవుతాయి. వేలిముద్ర వేశాక, కొత్తగా ఇచ్చిన కార్డునంబర్‌ను యంత్రంలో నమోదు చేస్తే లింకు ఓకే అవుతుంది. ఒక్క గ్రాము తక్కువున్నా స్వీకరించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. తీసుకున్న సరుకుల వివరాలు నేరుగా ఆన్‌లైన్‌లో పౌరసరఫరా శాఖకు చేరుతుంది. ప్రభుత్వం గడిచిన ఐదు నెలల్లో ఈ-పాస్ అమలుతో రూరల్ జిల్లాలో సుమారు రూ.6.50కోట్ల విలువైన రేషన్ బియ్యం సర్కారుకు మిగిలాయి. మిగతా బియ్యం క్లోజింగ్ బ్యాలెన్స్‌గా చూపుతుండటంతో భారీగా నిల్వ ఉంటున్నట్లు చెప్పారు. జిల్లాలో నెలకు సుమారు నాలుగు వేల క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్ షాపులకు కేటాయిస్తున్నారు. వీటిల్లో లబ్ధ్దిదారులు తీసుకున్నది పోను డీలర్లు క్లోజింగ్ బ్యాలెన్సుగా చూపించాల్సి ఉంది. అలాట్ అయిన దాంట్లో మిగిలినది చూసుకుని తిరిగి మరో నెలకు బియ్యాన్ని అలాట్‌మెంట్ చేస్తుండటంతో భారీగా మిగులు వస్తున్నది. సెప్టెంబర్‌లో 4110 టన్నులు అలాట్ చేయగా 585 మెట్రిక్ టన్నుల బియ్యం మిగులుగా వచ్చింది అంటే ఇదీ 14 శాతంగా నిర్థేశించారు. దీని మొత్తం విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.కోటి 44 లక్షలు ఉంటుంది. అంటే క్వింటాల్‌కు అన్ని ఖర్చులు కలుపుకుని 2493 లుగా లెక్కిస్తున్నారు. మిల్లర్లకు సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చి బియ్యాన్ని వారి నుంచి రూ.2400 క్వింటాల్‌కు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. గోదాం, బ్యాంకు వడ్డీలు, హమాలీ, ట్రాన్స్‌పోర్టు అన్ని ఖర్చులు కలిపితే కిలో బియ్యానికి రూ.30 చెల్లిస్తున్నా పేదలకు మాత్రం ఒక రూపాయికే ప్రభుత్వం అందిస్తున్నది. అక్టోబర్ 4153 టన్నులు అలాట్ చేయగా 516 మెట్రిక్ టన్నులు అంటే 12 శాతం మిగిలింది. దీని విలువ రూ.కోటి 22లక్షలు, నవంబర్‌లో 4151 టన్నులకు 514 టన్నుల మిగులు రాగా దీని విలువ రూ.కోటి 22 లక్షలు, డిసెంబర్‌లో 4151 టన్నులకు 556 మెట్రిక్ టన్నులు మిగులు అంటే 13 శాతం రాగా రూ.కోటి 33 లక్షలు, ఈ ఏడాది జనవరిలో 4151 టన్నులు కేటాయించగా 620 మెట్రిక్ టన్నులు అంటే 15 శాతం మిగులుగా రూ.కోటి 15లక్షల విలువ ఉంటుందని అధికారులు చెప్పారు. చౌక దుకాణాల లబ్ధిదారులు తప్పకుండా ప్రతి నెల 15లోగా తమ సరుకులను తీసుకోవాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వ కచ్చితమైన గడువును నిర్థేశించింది. గతంలో 25 వరకు డీలర్లు సరుకులు ఇచ్చినా క్లోజింగ్ బ్యాలెన్స్ చూసి మళ్లీ సరుకులు అలాట్ చేయడం, డీడీలు తీయడం ఆలస్యమవుతున్నది. దీంతో సరుకులు దుకాణాలకు ఆలస్యమైతే లబ్ధ్దిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే స్పష్టమైన గడువు విధించినట్లు అధికారులు చెప్పారు. ప్రతి నెల 1 నుంచి 15 వరకు సెలవులు లేకుండా డీలర్లు సరుకులను ఇవ్వాలి. తప్పనిసరిగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలి. 15 తర్వాత ఈ-పాస్‌ను నిలిపివేస్తారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20470
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author