నాపై కుట్ర జరుగుతోంది : చంద్రబాబు

నాపై కుట్ర జరుగుతోంది : చంద్రబాబు
March 22 13:50 2018

అమరావతి,
తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎక్కడా ఏ తప్పు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నన్ను బోనులో ఎక్కించేదాకా పీఎంను కలుస్తూనే ఉంటానని విజయసాయి రెడ్డి అన్న మాటల్లోనే వారి కుట్ర బైటపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు,ప్రజల హక్కుల సంగతి వారికి పట్టదని, తనపై వ్యక్తిగత కక్ష సాధింపే లక్ష్యంగా వైకాపా పనిచేస్తోందని అయన మండిపడ్డారు. గురువారం నాడు అయన పార్టీ ఎంపీలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయనమాట్లాడుతూ ఏపీకి న్యాయంగా రావలసినవి అడుగుతుంటే కేంద్రం, వైకాపా, జనసేనలు తనపై ముప్పేట దాడి చేస్తున్నాయని విమర్శించారు. తనపైనా, లోకేష్ , మంత్రులపైనా విమర్శల దాడి చేస్తున్నారని, ఈ ధోరణి మరింత పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లు కష్టపడ్డామని, సగటున 10.5% వృద్ధి ప్రతిఏటా సాధించామని, ఇంకా 4% పెరగాలని, పొరుగు రాష్ట్రంతో సమాన స్థాయికి చేరాలంటే మరో నాలుగేళ్లు పడుతుందని అయనఅన్నారు. ఒకవైపు కేంద్రంపై పోరాటం చేస్తూనే మరోవైపు అభివృద్ది ఆగిపోకుండా చూసుకోవాల్సివుంది. అందుకే జపాన్ తరహా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని అంటున్నానని అన్నారు. మరో 2గంటలు ఎక్కువ పనిచేసి, ఒక గంట నిరసన తెలపాలని పిలుపిచ్చానని వెల్లడించారు. అవిశ్వాసం చేపట్టకుండా సభను వాయిదా వేస్తే ప్రజలలోకి వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయనీ, విద్యార్థుల దృష్టి మాత్రం వాటిపైనే ఉండాలని చెప్పారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం, ద్రోహం రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని అన్నారు.
ఇప్పుడు గ్రామ గ్రామానా ఆ మూడు పార్టీల ధోరణి గురించే చర్చ జరుగుతోందని అన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అంగీకరించచి ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ ఎందుకు చేస్తున్నామో ప్రజలకు వివరించాలని చంద్రబాబు చెప్పారు. అప్పుడు ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనీ, హోదాతో సమానమైన ప్రయోజనాలు చేకూర్చేలా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినందునే అంగీకరించామని వివరించారు. గత కొంత కాలంగా కేంద్రం ధోరణి వేరేగా ఉందన్నారు. ఏపీకి సాయం చేయకూడదన్నది కేంద్రం విధానంగా కనిపిస్తోందన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20499
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author