ప్రైవేటు బస్సులపై ఆర్టీయే దాడులు..మూడు బస్సులు సీజ్

ప్రైవేటు బస్సులపై ఆర్టీయే దాడులు..మూడు బస్సులు సీజ్
March 22 13:54 2018

హైదరాబాద్,
శంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి పై తెల్లవారు జామునుంచి ప్రవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న ప్రవేట్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం తెల్లవారు జాము నుంచి రంగారెడ్డి రవాణా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలలో పలు ప్రవేటు ట్రావెల్స్ బస్సుల దొల్లతనం బయటపడ్డాయి. బెంగుళురు నుంచి హైదరాబాద్ వస్తున్న దాదాపు 100 బస్సులకు పైగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ మండలం తోండుపల్లి, గగన్ పహడ్ రెండు చోట్ల తనిఖీలు చెపట్టారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న 25 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేసారు. మూడు బస్సులను సీజ్ చేశారు. కర్ణాటక నుండి హైదరాబాద్ గుట్టు చప్పుడు కాకుండా ఎస్ ఆర్ ఈ ట్రావెల్స్ బస్సులో 10 సంచుల గుట్కా ముడి సరుకు దొరికింది. బస్సుల్లో రెండో డ్రైవర్ ఉన్నాడా, తెలంగాణ పర్మిట్ తీసుకున్నారా, స్టేజ్ క్యారియర్, మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా అనే అంశాలపై తనిఖీ నిర్వహించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20502
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author