ఐదు జిల్లాల్లో ఐటీ విస్తారణ : మంత్రి కేటీఆర్

ఐదు జిల్లాల్లో ఐటీ విస్తారణ : మంత్రి కేటీఆర్
March 22 13:58 2018

హైదరాబాద్,
టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో టీహబ్ విస్తరణ, ఎంతమంది ఉపయోగం, ఖమ్మం ఐటీ హబ్కు ఇంక్యుబేటర్ ఏర్పాటు వంటి తదితరాలపై సభ్యులు గణేష్ గుప్తా, పువ్వాడ అజయ్ సభలో ప్రశ్నలను లేవనెత్తారు. వాటికి మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ..టీహబ్-2 ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ కాబోతుందన్నారు. 3లక్షల 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్-2 నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రఖ్యాత కంపెనీలు టీహబ్తో కలిసి పని చేస్తున్నయని చెప్పారు. గోవా, అస్సాం, ఢిల్లీకి టీహబ్ గైడెన్స్ ఇస్తోందన్నారు. స్టార్టప్ల ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. స్టార్టప్ల ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఐదు నగరాల్లో టీహబ్ను విస్తరిస్తున్నామన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో ఐటీని విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ రోడ్లపై మంత్రి స్పందిస్తూ ఎస్ఆర్డీపీ కింద మొదటి దశలో రూ.200 కోట్ల సమీకరించామన్నారు. ప్రతీ పైసా రోడ్ల అభివృద్ధికే ఖర్చు పెడుతామన్నారు. హైదరాబాద్లో సులభ ప్రయాణం, ఇంధన వ్యయం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారన్నారు. హైదరాబాద్లో సులభ ప్రయాణం, ఇంధన వ్యయం తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వ్యూహాత్మక కార్యక్రమంతో ట్రాఫిక్ తగ్గించేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు. నగరంలో వాహనాల వేగం 35 కిలోమీటర్లకి పెరిగేలా చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20505
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author