నీటి పారుదల, పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యం

నీటి పారుదల, పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యం
March 22 17:58 2018

హైదరాబాద్
దేశంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వివరించారు. గురువారం సచివాలయంలో మేజర్ జనరల్ హర్ కిరత్ సింగ్ నేతృత్వంలో నేషనల్ డిఫిన్స్ కాలేజి సభ్యులు ఎకానామిక్ సెక్యూరిటీ స్టడీ టూర్ లో భాగంగా సి.యస్ ను కలిసారు. ఇరిగేషన్ రంగానికి బడ్జెట్ లో 25 వేల కోట్లు కేటాయించామని, కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, మిషన్ కాకతీయ ద్వారా 45000 చెరువుల మరమ్మతులు చేపట్టి చిన్ననీటి వనరులను పునరుద్దరించి గ్రామలలో నీటి భద్రతను కల్పించనున్నట్లు వారికి తెలిపారు. హైదరాబాదు నగరం నాలుగు వైపుల విస్తరిస్తున్నదని పారిశ్రామికంగా అనేక మంది పరిశ్రమల స్ధాపనకు ముందుకు వస్తున్నారని సి.యస్ వారికి వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 7600 మెగా వాట్ల స్ధాపిత సామర్ధ్యం ఉంటే నేడు 14 వేల మెగా వాట్లకు పైగా చేరుకున్నదని, 24X7 విద్యుత్ ను అందిస్తున్నామని, పవర్ హాలిడేలు లేవని సి.యస్ తెలిపారు. ఇరిగేషన్ ప్రాజేక్టుల నిర్మాణం సందర్భంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకెజికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. మేజర్, మీడియం ఇరిగేషన్ తో పాటు మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హైదరాబాదు నగరం భిన్న సంస్కృతులకు నిలయమని మంచి రోడ్లు, తగు భద్రత, మంచినీరు, నిరంతర విద్యుత్ సదుపాయాలు మెరుగైన జీవనానికి అనువైన నగరంగా రూపుదిద్దుకున్నదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీసీ బృందం హైదరాబాదుకు రావడం హర్షణీయమని తెలుపుతూ వారితో వివిధ విషయాలపై చర్చించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20541
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author