బీజేపీ క్షమాపణ చెప్పాలి :దూళిపాళ్ల నరేంద్ర

బీజేపీ క్షమాపణ చెప్పాలి :దూళిపాళ్ల నరేంద్ర
March 22 20:02 2018

అమరావతి,
బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నిన్న పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలు ఆయన బాద్యతరాహిత్యమని టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు .రెండు ఏళ్ల తర్వాత పట్టిసీమపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వది లేస్తున్నాం.డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుంది అని బాబు పట్టిసీమని తీసుకువచ్చారని అయన అన్నారు. ఓపెన్ గానే టెండర్లు పట్టిసీమకు పిలిచారు. ఇప్పటిదాకా 115 టీఎంసీ లనీరు పట్టిసీమ నుండి డెల్టా ప్రాంతానికి అందించారని అయన అన్నారు. పట్టిసీమ వల్ల డెల్టా లో పంటలు పండుతుంటే ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ జడ్జి తో విచారణ అంటున్నారు. సీబీఐ ఎంక్విరీ అనడం వెనుక ఉన్న కారణాలు ఏంటో చెప్పాలని నరేంద్ర డిమాండ్ చేసారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమ అద్భుతం అని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇప్పుడు ఎందుకు మాట మార్చారని నిలదీసారు. డెల్టా రైతాంగానికి బీజేపీ క్షమాపణ చెప్పాలి.డెల్టా రైతుల్ని అవమనపరిచేవిధంగా బీజేపీ వ్యాఖ్యలు ఉన్నాయని అయన అన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20596
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author