శివారు ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు

శివారు ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు
March 23 11:32 2018

విజయనగరం,
విజయనగరం నగర పంచాయతీలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎక్కువుగా ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. పంచాయతీ నుంచి పట్టణంలో బల్లంకివీధి, వాండ్రంకివీధి, మండాకురిటి వీధి తదితర ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. చెక్కుపోస్టు జంక్షన్‌ వద్ద పైపులైన్‌ నుంచి నగర పంచాయతీకి వస్తున్న పైపులైన్‌ దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు నీటిని పట్టుకుంటున్నారు. అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవి వస్తే మరింత కష్టమవుతోంది. వేసవి తీవ్రతను తట్టుకోవడానికి ముందు నుంచే ప్రభుత్వం శివారు ప్రాంతాలకు, అలాగే నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయినా శివారు ప్రాంతాల్లో నీరందే పరిస్థితి కనిపించడంలేదు.వాండ్రంకి వీధి, బల్లంకి వీధి ప్రాంతాల్లో బిందెడు నీరు రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రూ.5 ఇచ్చి బిందెడునీరు తెచ్చుకుంటున్నారు. చేసేదేమి లేక ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నవారు నీటిని కొనుక్కుంటున్నారు. శాశ్వత పైపులైన్‌ పనులు నిర్మాణం జరిగితే ఆ ప్రాంతాలకు నీరందే పరిస్థితి కనిపిస్తుంది. రూ.50 కోట్లతో నాన్‌ అమృత పథకం మంజూరైతే ఈ ప్రాంతంలో నీటికష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోగలం. అంతవరకు ఏమీ చేయలేం. ఇప్పటికే నాన్‌అమృత పథకం కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం పరిధిలో ఉంది. నిధులు మంజూరైతే పనులు వేగంగా చేసి, పట్టణమంతా నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడతాం

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20615
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author