తిరుమల ఘాట్ రోడ్లలో ఎలక్టిక్ బస్సులు..

తిరుమల ఘాట్ రోడ్లలో ఎలక్టిక్ బస్సులు..
March 23 11:35 2018

తిరుమల,
పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో నిత్యం అలరాడే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు. ఇలా రోజుకు సుమారు పది వేల వాహనాల దాకా రాకపోకలు తిరుపతి నుండి తిరుమలకి, తిరుమల నుండి తిరుపతి మద్యన సాగుతుంటాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో కెల్లా ఇంధన వ్యయం, అందుకు తగ్గ రాబడి తెచ్చి పెడుతూ రాష్ట్రంలో ద్వితీయ స్ధానంలో తిరుమల-తిరుపతి ఆర్.టీ.సీ విభాగం ఉంది. అదే స్థాయిలో తిరుమల కాలుష్య ప్రమాదంలో పడటానికి ఆర్ టీ సీ బస్సులు కూడా ఒక రకంగా దోహదం పడుతున్నాయి. వేలాది మంది భక్తులను తిరుమలకు తీసుకెళ్ళి మళ్ళీ తిరుపతికి తరలిస్తుంటాయి ఆర్ టీ సీ బస్సుల్లో. ఘాట్ రోడ్లలో ఆర్ టీ సీ ప్రయాణం నిజంగా సురక్షితం. అందుకే భక్తులు సైతం బస్సుల్లోనే ప్రయాణానికి మెగ్గు చూపుతారు.
తిరుమల-తిరుపతిలోని వివిధ వాహనాలతో కూడిన సొంత వాహనాలు, ప్రవేటు ట్రావెల్స్ వారి సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న. ఈ వాహనాల నుండి వెలువడే పొగ కాలుష్యంతో కొండకు ముప్పు వాటిల్లుతొంది. నిత్యం ఘాట్ రోడ్డు మార్గాల గుండా ప్రయాణించే వాహనాలలో అధికశాతం కాలం చెల్లిన వాహనాలు నడుస్తున్నాయి. సాధారణ రొడ్లలో వీటి నుండి వెలువడే కాలుష్యం అంతకు తెలియక పోయినా, ఘాట్ రోడ్లలలో మాత్రం వీటి నుండి వెలువడే కాలుష్యం అధికస్ధాయిలో ఉంటున్నది.అలా తిరుమలకు వెళ్ళిన వాహనాలు అదే స్థాయిలో తిరుమల కొండపై కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల పొంచివున్న ప్రమాదంతో పాటు, భవిష్యత్తులో మరింత వాహన రాకపోకలు జరిగి పొగ కాలుష్యయం మితిమిరి తిరుమల కొండకు పెద్దప్రమాదమే జరుగే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నిపుణులు పరిశీలనలో గతంలోనే తేలింది. నిత్యం క్షణం తీరిక లేకుండా ఘాట్ రోడ్లలో తిరిగే వాహనాల వల్ల పచ్చటి తిరుమల గిరులను పొల్యూషన్ కమ్మేస్తోంది. దీంతో కాలుష్య రహిత వాహనాల వినియోగానికి శ్రీకారం చుట్టు బోతున్నారు టీటీడీ అధికారులు. అందులో భాగంగా తిరుమలలో అత్యాధున పరిజ్ణానంతో రూపొందిచిన ఎలక్ట్రిక్ బస్సును ప్రయోగాత్మకంగా గత మూడురోజుల క్రితం పరిశీలించారు. అంతా ఒకే అనుకుంటే త్వరలో ఘాట్ రోడ్ లో ఎలక్ట్రిక్ బస్సులు రయ్యి మంటూ దూసుకు పోనున్నాయి.
ఒకప్పుడు రోజుకు వందలు వేలల్లో ఉండే తిరుమల యాత్రికుల సంఖ్య నేడు లక్షను దాటాస్తోంది. దీంతో భక్తుల సంఖ్యతో పోటీ పడుతూ అదేస్ధాయిలో తిరుమల గిరుల్లో పొల్యూషన్ కూడా పెరిగిపోతోంది. నిత్యం క్షణం తీరిక తిరుమల రెండుఘాట్ రోడ్లలోనూ వందలాది వాహనాలు తిరుగుతున్న కారణంగా పొల్యషన్ స్ధాయి ప్రమాదకర స్ధాయికి చేరుకుంటుంది. ఈ ప్రభావంతో ఎత్తైన కొండలు ,పచ్చనిచెట్లతో ఆహ్లాదరంగా ఉండాల్సిన చల్లని వాతావరణంలో మార్పులు వస్తున్నాయ. తిరుమల శ్రీవారి ఆలయ పరిశరాలు ఇప్పిటికే కాంక్ట్రీంట్ మయం అయిపోవడంతో పాటూ అపరిమిత వాహనాల వచ్చే కాలుష్యం రోజురోజుకూ ఇబ్బందికరంగామారుతోంది. దీనికి పరిష్యార మార్గంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోంది టీటీడీ దేవస్థానం. ఇప్పటికే తిరుమలతో పాటూ తిరుపతిలోనూ ఎలక్ట్రిక్ బస్సుకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు. ఇందు కోసం అనుభవజ్ణులైన ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షిన కూడా ఇచ్చారు. దక్షిణ భారత దేశంలో తిరుమలలోనే తొలిసారి వినియోగంలోకి రాబోతున్నాయి. తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి… తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు నడపాలని భావించింది. అయితే ముందుగా తిరుమలలో ఇవి ట్రయిల్ రన్ చేస్తున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20619
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author