అన్నింటికి సిద్దంగా వుండాలి…. చంద్రబాబు

అన్నింటికి సిద్దంగా వుండాలి…. చంద్రబాబు
March 23 11:43 2018

అమరావతి,
ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మన ఎంపీలు చేసిన పోరాటం ప్రజలలోకి బలంగా వెళ్లిందన్నారు. ఇదే జోరు కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.అనుకున్న లక్ష్యం సాధించాలి. ఏకతాటిపై ఎంపీలంతా నిలబడాలి.రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలి.ప్రజల మనోభావాలు ప్రతిబింబించాలి. పదేపదే కేంద్రం చుట్టూ తిరిగాం,అయినా చేయలేదని అయన అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులలో కోతపెడుతున్నారనీ, అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు ధారాళంగా నిధులు ఇస్తున్నారనీ చంద్రబాబు అన్నారు. పదేపదే అడిగాం,అయినా స్పందించలేదు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని అయన అవేదన వ్యక్తం చేసారు. తనకు మోడీపై కానీ, బీజేపీపైకానీ ఎటువంటి కోపం లేదనీ ఏపీకి అన్యాయం చేశారన్న బాధ మాత్రం ఉందని చెప్పారు. మన పోరాటం కారణంగా మున్ముందు కేంద్రం మరిన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందన్న చంద్రబాబు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యాయం కోసం మనం పోరాడుతున్నాం.ప్రజల హక్కులు కాపాడమంటున్నాం. అందులో తప్పేమిటి..?ఎందుకు న్యాయం చేయరు…? మన హక్కులు ఎందుకు నెరవేర్చరు..? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎంపీలంతా జాగ్రత్తగా వ్యవహరించాలి.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.రాబోయే ఇబ్బందులకు సిద్ధంగా ఉండాలి. అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని అయన అన్నారు. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నదే మన బాధ అని అయన అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20625
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author