హైదరాబాద్ లో రాజ్యసభ ఎన్నికలు

హైదరాబాద్ లో రాజ్యసభ ఎన్నికలు
March 23 11:47 2018

హైదరాబాద్,
హైదరాబాద్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు మంత్రి తన్నీరు హరీష్ రావు వేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఓటేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలంతా శుక్రవారం నాడు ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి వచ్చారు. హరీష్ రావు తొలి ఓటు వేయగా, ఆ తరువాత మంత్రి మహేందర్ రెడ్డి ఓటు వేశారు. తెరాస ఎన్నికల ఏజెంట్లుగా రమేష్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, గట్టు రామచంద్రరావులు, కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్లుగా మల్లు రవి, సీతక్క, రేగా కాంతారావు, కోదండరెడ్డి వ్యవహరించారు. మూడు స్థానాలకు గానూ 4గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ ఎస్ నుంచి బండ ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, జోగినిపల్లి సంతోష్ కుమార్ బరిలో ఉన్నారు. వారి గెలుపు లాంఛనం కానుంది. శాసనసభలో టీఆర్ఎస్కు తగిన బలం ఉండడానికి తోడూ ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉన్నారు.
కాగా, రాజ్యసభ ఎన్నికలలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోనికి తీసుకోవద్దని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాజ్యసభ ఎన్నికలలో మూడు స్థానాలకు గాను నలుగురు అభ్యర్థులు రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోనికి తీసుకోవద్దని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ నుంచి బహిష్కృతులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు ఓటు హక్కు లేకుండా పోయింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20627
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author