పశువైద్యశాలల్లో డాక్టర్లు కావలెను

పశువైద్యశాలల్లో డాక్టర్లు కావలెను
March 23 12:30 2018

మంచిర్యాల,
వైద్య సేవలు అందకపోవడం వలన పశువులు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో పశువైద్యం అందక మూగ జీవాల రోదన అరణ్యరోదనగానే మారుతుంది. పలుచోట్ల సిబ్బంది కొరత కారణంగా పశువైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి యాదవులకు గొర్రెలను పంపిణీ చేయగా అవికూడా వైద్య సేవలు అందక మృతి చెందుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, పశువులకు సేవలు అందించే విషయంలో శ్రద్ద చూపడం లేదని రైతులు వాపోతున్నారు. పశువుల సంఖ్యకు తగినట్లుగా వైద్యశాలలు లేకపోవడం వలన దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. మంచిర్యాల జిల్లాలో వ్యవసాయం తరువాత ప్రజలకు ప్రధానంగా పాడిని ఆధారంగా చేసుకొని జిల్లాలో వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. కొన్ని గ్రామాలను కలపి ఒక వైద్యశాలను ఏర్పాటు చేయడం వలన అందులో సరైన సిబ్బంది లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అసలే పోస్టులు తక్కువగా ఉండగా వాటికి తోడు ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండడం వలన అదనపు బాధ్యతలు అప్పటించడం వారు కూడా వైద్య శాలలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 44 వైద్యశాలలు ఉండగా ఇందులో 26 భవనాలు శిథిలావస్థకు చేరగా మరికొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఒక జాయింట్ డైరెక్టర్ పోస్టు ఉండగా మూడు ఏడి పోస్టులు కేవలం ఒకరు మాత్రమే పని చేస్తున్నారు. 26 డాక్టర్ పోస్టులకు గాను 23 మంది రెగ్యులర్‌గా పని చేస్తుండగా మిగతా చోట్ల డిప్యూటేషన్ పని చేస్తున్నారు. వెటర్ననరీ అసిస్టెంట్లు 38 పోస్టులకు గాను కేవలం 17 మంది మాత్రమే పని చేస్తున్నారు. అదే విధంగా 44 మంది అటెండర్లకు గాను 33 మంది పని చేస్తుండగా 11 ఖాళీలుగా ఉన్నాయి. నియోజకవర్గం స్థాయిలో రెండు భవనాలకు గాను ఒక భవనం శిథిలావస్థకు చేరుకుంది. మండల స్థాయిలో 27 భవనాలకు గాను 10, గ్రామీణ స్థాయిలో 15 భవనాలకు గాను 15 శిథిలావస్థకు చేరగా 9 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. జిల్లాలో ఆవులు, ఎద్దులు 2,08,011 ఉండగా, గేదెలు 1,07,987, గొర్రెలు 2,91,15, మేకలు 1.42,447, కోళ్లు 3,96,856. ఇతర జంతువులు 2753 ఉన్నాయి. కోటపల్లిలోని ప్రభుత్వ వైద్యశాల మండలంలోని 21 గ్రామాలకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా చిన్న రేకుల షెడ్‌లో నిర్వహిస్తున్నారు. మండలంలోని దేవులవాడ సిర్సా, జనగాం గ్రామాల్లో పశువైద్యశాలలు ఏర్పాటు చేయాలని, రెండేళ్ల కిత్రమే అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అదే విధంగా వేమనపల్లి , దండేపల్లి మండలాల్లో కూడా పశు వైద్యశాలలు శిథిలావస్థకు చేరాయి. పశువైద్యశాలల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులు ఎన్నో సార్లు నివేదికలు పంపినప్పటికీ ప్రయోజనం లేకపోగా జిల్లాలో ఆశించిన మేరకు పశువైద్యసేవలు అందక మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20638
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author