మిర్చి ధర రెట్టింపుయింది

మిర్చి ధర రెట్టింపుయింది
March 23 12:43 2018

ఖమ్మం,
మిర్చి ధర కొద్ది రోజులకే క్వింటా ఒక్కొంటికి దాదాపు రూ. 2వేలు తగ్గింది. తిరిగి గత పదిహేను రోజుల నుంచి మళ్లీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాకు ఒక్కొంటికి ఖమ్మం మార్కెట్‌లో గరిష్టంగా రూ.11 వేలు పలికిన సంగతి విదితమే. అనంతరం జాతీయ మార్కెట్ ప్రభావం తదితర కారణాల వల్ల క్వింటాకు ఒక్కంటికి రూ. 9 వేలకు పడిపోయింది. దీంతో ఈ సంవత్సరం మిర్చి సాగు చేసిన రైతులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 12, 552 హెక్టార్లలో సాగు చేయగా యాసంగిలో మరో 701 హెక్టార్లలో సాగు అయింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం మిర్చి పంట సాగు గణనీయంగా తగ్గింది.ధరలు పెరుగతుండటంతో అన్నదాతల ముఖంలో ఆనందం కనిపిస్తోంది. మార్కెట్లో జరిగిన జెండాపా టలో మిర్చి గరిష్ఠ ధర రూ.10,400 పలుకగా కనిష్ఠ ధర రూ. 8,500, మధ్య ధర రూ.9,800 పలికింది. తాలు రకం మిర్చికి క్వింటా ఒక్కొంటికి గరిష్ఠ ధర రూ.4,500 పలుకగా కనిష్ఠ ధర రూ.3,000, మధ్య ధర రూ. 4,200 చొప్పున ధర పలికింది. మార్కెట్‌కు రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభమైంది. దీంతో భారీగా బస్తాలు వచ్చాయి. రాష్ట్రంలోనే తేజా రకం మిర్చి పంట ఎక్కువ మొత్తంలో ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో మిర్చి ఎక్కువగా సాగవుతోంది. దీంతో ఖమ్మం మార్కెట్‌కు ప్రతి ఏటా ఎక్కువ మొత్తంలో రైతులు దిగుబడి తీసుకువస్తారు. అందులో భాగంగానే ఒక్కరోజే మార్కెట్‌కు 25 వేల బస్తాలు రావడం గమనార్హం. మార్కెట్ కార్యదర్శి సంతోష్‌కుమార్ నేతృత్వంలో క్రయవిక్రయాల ప్రక్రియ చేపట్టడం జరిగింది. సకాలంలో క్రయవిక్రయాల ప్రక్రియ పూర్తి కావడంతో మిర్చి తీసుకువచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20646
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author