అన్నా డిమాండ్లను నెరవేర్చాలి … అందోల్ క్రిష్ణ

అన్నా డిమాండ్లను నెరవేర్చాలి … అందోల్ క్రిష్ణ
March 23 15:08 2018

సంగారెడ్డి,
అన్నా హాజారే డిమాండ్లను నెరవేర్చాలని కోరారు సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, టి.జెఎసి స్టీరింగ్ కమిటీ మెంబర్ అందోల్ క్రిష్ణ. దేశంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణా ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని, సిఎం కెసిఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో వంద మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఈ గణాంకాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయన్నారు. రైతులను ఆదుకోవాలని, వ్యవసాయానికి ప్రోత్సహకాలు పెంచాలన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు ఐదు వేల రూపాయల పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకాయుక్తా, లోక్పాల్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వీటిపై అన్నా హాజారే పలుమార్లు ప్రధాని మోడీకి లేఖ రాశారని, స్పందించకపోవడంతో దీక్షకు పూనుకున్నారన్నారు. అన్నా దీక్షకు మద్దతుగా వేలాది మంది తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. గ్రామాల్లో దీక్షలు చేపట్టారన్నారు. ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు సంకల్ప స్వచ్ఛంధ సంస్థ డైరెక్టర్ సుభాష్, రాంచందర్, సతీష్, రమేష్, రాంప్రసాద్, కిశోర్, సత్తయ్య, నర్సింలుతో పాటు దాదాపు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20659
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author