హంద్రీ నీవా నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు

హంద్రీ నీవా నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు
March 23 15:46 2018

అమరావతి,
అనంతపురం జిల్లాలోని మారాల , చెర్లోపల్లి రిజర్వాయర్ , మడకశిర బ్రాంచ్ కెనాల్ కు ఎప్పుడు నీళ్లు ఇస్తారు. బుక్కపట్నం చెరువు ముంపురైతులకు , హంద్రీనీవా కాలువ రైతులకు ఎప్పటిలోగా పరిహారం చెల్లిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు అయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. జిల్లాలో నేడు జల కల సాకారం కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషి , పట్టుదలే కారణమని వారిని జిల్లా ప్రజల తరపున ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం అనంత జిల్లాకు హంద్రీనీవా ద్వారా 87.8 టీఎంసీల నీళ్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుంది. హంద్రీనీవా రాకతో జిల్లాలో 400 చెరువులు, 1000 చెక్ డ్యామ్ లు, 40 వేల బోరుబావులు రిచార్జ్ అయ్యి 1 లక్ష 42 వేల ఎకరాలు సాగులోకి వచ్చిందని ఇది మా ప్రభుత్వ ఘనత అని గుర్తు చేస్తూ, మరోసారి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ని అభినందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో హంద్రీనీవా కాలువ కింద ఎన్ని ఎకరాలు సేకరించారు? ఎంత మందికి పరిహారం ఇచ్చారు? ఇంకా ఎంత మంది కి పరిహారం అందించాల్సి ఉందని అన్నారు. జిల్లాలో అతిపెద్ద దైన బుక్కపట్నం చెరువును 500 ఏళ్ల క్రితం అభినయ శ్రీకృష్ణదేవరాయలు నిర్మిస్తే , ఇప్పటి అభినయ కృష్ణరాయలు చంద్రబాబు నాయుడు కృష్ణా జలాల తో నింపారని గుర్తుచేశారు. వీరిని జీవితాంతం ఈ ప్రాంత రైతులు చంద్రబాబు ను గుర్తుపెట్టుకుంటారని అన్నారు.
బుక్కపట్నం చెరువును హంద్రీనీవా ద్వారా నింపడంతో అక్కడ ఉన్న 180 ఎకరాలు ముంపుకు గురై సుమారు 80 మంది కమ్మవారిపల్లి, జానకం పల్లి కి చెందిన రైతులకు జీవనాధారంగా ఉన్న భూములు కోల్పోతారని వీరికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హామీ మేరకు ప్రభుత్వం ఎప్పటిలోగా ఆ రైతులకు పరిహారం చెల్లిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ కోరారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20662
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author