రాష్ట్రంలో నియంతృత్వపాలన : బీజేపీ

రాష్ట్రంలో నియంతృత్వపాలన : బీజేపీ
March 23 16:53 2018

హైదరాబాద్,
పౌరహక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ… నిరసన తెలిపే అధికారం అంబేద్కర్ అందరికీ కల్పించారన్నారు. కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నారా లేదా నిజాం నిరంకుశ పాలన అమలు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్లనిర్లక్ష్యం వహిస్తోంది రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహ్యలు పెరిగిపోయాయని అయన ఆరోపించారు. రుణమాఫి సరిగా చేయలేదు…. రుణాలు కట్టకపోతే ఆస్థులు జప్తు చేస్తామంటున్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన నిధులు చెల్లించపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అయన అన్నారు. చలో అసేంబ్లి అంటే రాష్ట్రంలో మారుమూలలో ఉన్న వారిని అరెస్టు చేయడం అన్యాయం. ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ప్రజలు తగిన బుద్ది చెబుతారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యం చేసిందని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ మా కార్యాలయం వద్ద ఎవరూ వెల్తున్నాఅరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు కేంధ్రం మూడూశాతం ఇచ్చింది. రాష్ట్రం ఒక శాతాం కడితే సరిపోయేది. అదీ చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో ప్రధానమంత్రీ ఫసల్ భీమా పరిహారం కూడా రావడంలేదని విమర్శించారు. శాంతియుతంగా సమ్మె చేస్తామంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రైతులు కార్యకర్తలు అరెస్టుచేసారని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్భంద కాండ అమలుచేస్తున్నారు. తెలంగాణ ఉధ్యమంలో కూడా ఇంత నిర్భందంలేదనిఅయన అన్నారు. రైతులకున్యాయం చేసేవరకు తమ పోరాటం ఆగదని అన్నారు. రాజ్యంగం నిరసనతెలిపే హక్కు ఇచ్చింది. రాజ్యంగం అమలు చేస్తున్నారా.నిజాంపాలనను సాగిస్తున్నారా అని అడిగారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20677
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author