నెల్లూరులో నకిలీ పోలీసులు హల్ చల్

నెల్లూరులో నకిలీ పోలీసులు హల్ చల్
March 23 17:08 2018

నెల్లూరు,
నెల్లూరు జిల్లాలో పోలీసులమంటూ అమాయకుల నుంచి నగదు గుంజుతున్న నలుగురు నకిలీ పోలీసులను నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల సొత్తు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ డిఎస్పీ బాలసుందర రావు కేసు వివరాలు తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గుండాల వంశీకిష్ణారెడ్డి, మాలెపాటి హర్షవర్దన్, చల్ల గోవర్దన్ అలియాస్ జగ్గు, గుండాల మహేంద్రరెడ్డిలు నకిలీ పోలీసుల అవతారమెత్తి గత కొంత కాలంగా మోసాలకు పాల్పడుతున్నారు.. ఈ విషయంపై దృష్టి సారించిన క్రైమ్ పోలీసులు, నాల్లో పట్టణ పోలీసుల సహకారంతో ఈ నలుగురిని వలపన్ని పట్టుకున్నారు. ముఠాకు నాయత్వం వహిస్తున్న వంశీకిష్ణారెడ్డితో పాటు మిగిలిన ముగ్గురు పాత నేరస్తులే. వీరంతా గతంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, వివిధ ప్రాంతాల్లో నేరస్తులతో కలిసి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై కేసులు నమోదయ్యాయని బాలసుందరరావు చెప్పారు.
నాయుడుపేటకు చెందిన వంశీకిష్ణారెడ్డి పై హైదరాబాద్ లో ఒక రేప్ కేసుతో పాటు నెల్లూరు టౌన్, టీపీ గూడూరులో చీటింగ్, డెకాయిట్ కేసుల్లో ప్రదాన ముద్దాయి. మాలేపాటి హర్షవర్దన్ తెలంగాణాలో పలు చీటింగ్ కేసుల్లో నిందితుడు. జిల్లాలోని ముత్తుకూరుకు చెందిన చల్లా గోవర్దన్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. చివరి నిందితుడైన గుండాల మహేంద్రరెడ్డి పై హైదరాబాద్ లోఒక రేపు కేసు నమోదైంది..ఈ నేపథ్యంలో వీరి కదలికలపై క్రైమ్ పోలీసులు గత కొంతకాలంగా నిఘా వుంచారు. నిందితులు అమాయకులను టార్గెట్ చేసి వారి నుంచి డబ్బు రాబట్టే ప్రయత్నం చేశారు. నెల్లూరుకు చెందిన ఓ కుటుంబానికి ఒక నేరంతో సంబంధం ఉందన్న విషయం తెలుసుకుని ఈ నలుగురు పోలీసుల వేషంలో వారింటికి వెళ్లారు. ఆ ఇంటి యాజమానిపై ఉన్న కేసును మాఫి చేసేందుకు అతని భార్య నుంచి మూడు లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. ఇవే కాకుండా పోలీసుల వేషంలో ఈ ముఠా మరిన్ని నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20687
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author