సిద్దిపేటకు మరో జాతీయ స్థాయి మణిహారం

సిద్దిపేటకు మరో జాతీయ స్థాయి మణిహారం
March 23 17:12 2018

న్యూఢిల్లీ,
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్ధిపేటకు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట మున్సిపాలిటీ చేపట్టిన ఓడీఎఫ్ కార్యక్రమం, పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగం, చెత్త సేకరణ, చెత్తను తడి-పొడిగా చేయాల్సిన ఆవశ్యకత సేకరించిన చెత్తను మున్సిపాలిటీ అందించడం పొడి చెత్తను ఎన్జీఓస్-ఐటీసీ సమన్వయంతో అందజేసి ఆర్ధిక స్థితి గతిని ఆరోగ్యాన్ని ఏ విధంగా మేరుగుపర్చుకోవాలన్న పలు అంశాలపై ఎన్నో కార్యక్రమాలను సిద్ధిపేట మున్సిపాలిటీ మెప్మా తరపున చేపట్టింది. అన్ని రంగాల్లో సిద్ధిపేటను అగ్రభాగాన నిలపాలన్న రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సంకల్పం, పట్టణాభివృద్ధి పై ప్రత్యేక విజన్ పట్టుదలకు మద్దతుగా పట్టణ ప్రజానీకమం నిలిచింది. దరిమిలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మెప్మా తరపున అన్ని ఎస్ఎల్ఎఫ్ లతో కలిసి బాధ్యతాయుతంగా సిద్ధిపేట మున్సిపాలిటీ సహకారంతో స్లమ్ లెవల్ ఫెడరేషన్-ఎస్ఎల్ఎఫ్ శ్రీ సాయితేజ స్లమ్ సమాఖ్య బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా నిలుపడంలో శ్రీ సాయితేజ స్లమ్ సమాఖ్య కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ తీరులతో అనిర్వచనీయమైన పాత్ర నిర్వహించి జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిపేందుకు దోహదం చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పధకం కింద కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖచే దేశంలోని అన్ని పట్టణాల నుంచి నామినేషన్లను కోరింది. దేశ వ్యాప్తంగా ఈ పోటీలలో 196 నామినేషన్లను స్వీకరించింది. ఈ దరిమిలా 26 స్లమ్ సమాఖ్యలు-ఎస్ఎల్ఎఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. వీటిలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కేటగిరీలలో సిద్ధిపేట ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీ-మెప్మా పరిధిలోని శ్రీ సాయితేజ స్లమ్ సమాఖ్య, కంచరి బజారు జాతీయ స్థాయిలో మొట్ట మొదటి స్థానాన్ని పొందింది. ఈ స్లమ్ సమాఖ్యకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతిగా ఎక్సలెన్స్ అవార్డు సర్టిపికేట్ ప్రశంస పత్రం, షీల్డ్ తో పాటు రూ.1.50 లక్షల నగదు పారితోషికాలు లభించాయి. తెలంగాణ నుంచి ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, సిద్ధిపేట 3 పట్టణాలు ఈ పోటీలో నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో సిద్ధిపేట ప్రథమ స్థానం బహుమతి పొందింది. ప్రశంస పత్రం, షీల్డు పొందడంతో పాటు శ్రీ సాయితేజ స్లమ్ సమాఖ్య రూ.1.50 లక్షలు నగదు పారితోషికం పొందింది. ఈ మేరకు దేశ రాజధాని న్యూ డీల్లీలో శుక్రవారం నేషనల్ వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి హర్దీవ్ సింగ్ పురి చేతుల మీదుగా సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్-మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సాయితేజ స్లమ్ సమాఖ్య అధ్యక్షురాలు నవ్య, కార్యదర్శి విజయ, మెప్మా బృందం ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, తెలంగాణ రాష్ట్ర అడిషనల్ మిషన్ డైరెక్టర్ జాన్ శాంసన్, మెప్మా రాష్ట్ర మిషన్ కో ఆర్డీనేటర్ సుజాత, మెప్మా సిద్ధిపేట జిల్లా మిషన్ కో ఆర్దీనేటర్ హన్మంతరెడ్డి, ఏడీఎంసీ సంతోషిమాత, అర్బన్ ప్లానర్ సంగీత, సిద్ధిపేట పట్టణ మిషన్ కో ఆర్డీనేటర్ సాయి కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20690
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author