పొంచి ఉన్న నీటి కటకట!

పొంచి ఉన్న నీటి కటకట!
March 23 17:19 2018

ఖమ్మం‌,
ఎండల తీవ్రత అధికమవుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు కూడా పనిచేయాలని పరిస్థితి. దీంతో నీటి ఎద్దడి ఉన్న గ్రామాల వాసులు మంచినీళ్ల కోసం సతమతమవుతున్నారు. బిందెడు నీటికోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలోనూ నీటికి ఇబ్బందులు పెరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. వేసవి పూర్తిగా రాకముందే తాగునీటికి సంబంధించిన బోర్లు అడుగుంటుతున్నాయని వాపోతున్నారు. వేంసూరు పరిశరాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు 60 మంచినీళ్ల ట్యాంకులు ఉన్నాయి. నేరుగా నీటిని సరఫరా చేసేందుకు 100కు పైగానే బోర్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేని పరిస్థితి నెలకొందని సమాచారం. ఇప్పటికే 20 గ్రామాల్లో అద్దె బోర్లను వినియోగించి తాగునీటిని అందిస్తున్నారని అంటున్నారు.
వేంసూరు, పెనుబల్లి మండలాలకు తాగునీరు అందించేందుకు లంకాసాగర్ లో రూ.10కోట్లతో ఫ్లోరైడ్ లేని మంచినీటి పథకం నిర్మించారు. 15ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసిన ఈ పథకం కాలక్రమంలో నిరాదరణకు గురైందని స్థానికులు అంటున్నారు. దీంతో ఈ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితులున్నాయని చెప్తున్నారు. మార్చిలోనే బోర్లు అడుగంటుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నడి వేసవిలో నీటికి అల్లాడిపోవాల్సి వస్తుందని అంతా భయపడుతున్నారు. వేసవి ముదిరిపోక ముందే నీటికి సమస్యలు రావడానికి ప్రధాన కారణం గ్రామాల్లోని చెరువులు ఎండిపోవడమని అంతా అంటున్నారు. వ్యవసాయ బోర్లు 24 గంటలు నీటిని తోడడం మరో కారణంగా చెపుతున్నారు. గతంలో 9 గంటలు విద్యుత్తు సరఫరా చేసినప్పుడు మే నెలలో మాత్రమే బోర్లు అడగంటేవి. ప్రస్తుతం 24 గంటల విద్యుత్తుతో రైతులు అధికంగా నీటిని వినియోగిస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో తాగునీటికి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20695
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author