ముందుంది నీటి గండం

ముందుంది నీటి గండం
March 23 17:52 2018

రాజమండ్రి,
జిల్లాలో పలు చోట్ల ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఉపాధి హామీ పనుల కింద రూ.కోట్లు వెచ్చించి పంట సంజీవని పేరుతో నీటి కుంటల తవ్వకాన్ని చేపట్టినా వాటి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మెట్టతో పాటు తీర ప్రాంతాల్లోని పలు మండలాల్లో భూగర్భ జలాలు గత ఏడాదితో పోల్చితే బాగా తగ్గిపోయాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం సైతం 24 శాతం తక్కువగా ఉంది. 1102.50 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 827.70 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. భూగర్భ జలాలు పడిపోవడానికి ఇదీ ఒక కారణమని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 2017 మార్చిలో 9.44 మీటర్లు ఉండగా 2018 మార్చిలో ఇది 9.77 మీటర్లకు పడిపోయింది. గత ఏడాది మార్చితో పోల్చితే 0.33 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గింది. బిక్కవోలు, గండేపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట, కిర్లంపూడి, కోరుకొండ, రాజానగరం, రావులపాలెం, పెదపూడి, కడియం, కాకినాడ, అయినవిల్లి తదితర మండలాల్లో భూగర్భజల మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి.
బిక్కవోలు మండలం భలభద్రపురం-1లో 2017 మార్చిలో 5.671 మీటర్ల లోతున నీటిమట్టం ఉండగా ఈ ఏడాది మార్చిలో 7.421 మీటర్ల దిగువకు చేరింది. భలభద్రపురం-3లో గత మార్చిలో 23.39 మీటర్ల లోతున ఉన్న నీటి మట్టం ఈ ఏడాది మార్చిలో 25.467 మీటర్లకు పడిపోయింది. బిక్కవోలులో గత ఏడాది మార్చిలో 4.456 మీటర్ల లోతున నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 5.55 మీటర్లకు పడిపోయింది. గండేపల్లి పరిధిలో గత మార్చిలో 66.92 మీటర్ల లోతున నీటిమట్టం ఉండగా ఇప్పుడు 68.941 మీటర్లకు చేరింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో గత మార్చిలో 23.41 మీటర్లు ఉండగా ప్రస్తుతం 24.539 మీటర్లకు తగ్గింది. జగ్గంపేట పరిధిలో గత ఏడాది మార్చిలో 23.401 మీటర్ల లోతున ఉన్న నీటిమట్టం ఈ ఏడాది మార్చికి 25.55 మీటర్లకు పడిపోయింది. కిర్లంపూడిలో గత ఏడాది మార్చిలో 5.564 మీటర్ల లోతున ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 6.629 మీటర్లకు పడిపోయింది. కోరుకొండలో గత ఏడాది మార్చిలో 1.318 మీటర్ల లోతున ఉండగా ప్రస్తుతం 3.905 మీటర్ల దిగువకు చేరింది. రాజానగరం పరిధిలోని సంపత్‌నగర్‌ గ్రామంలో గత ఏడాది మార్చిలో 20.905 మీటర్ల లోతున ఉండగా ప్రస్తుతం 23.108 మీటర్లకు తగ్గింది. రావులపాలెం పరిధిలోని గోపాలపురం వద్ద గత మార్చిలో 8.985 మీటర్ల లోతున ఉండగా ప్రస్తుతం 10.031 మీటర్లకు పడిపోయింది.జిల్లాలో సగటు నీటిమట్టం గత ఏడాది మార్చిలో 9.44 మీటర్లు కాగా ప్రస్తుతం 9.77గా నమోదైంది.
జిల్లాలో సాధారణ వర్షపాతం సైతం 24 శాతం తక్కువగా ఉంది. 1102.50 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 827.70 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. భూగర్భ జలాలు పడిపోవడానికి ఇదీ ఒక కారణమని అధికారులు చెబుతున్నారు.జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 2017 మార్చిలో 9.44 మీటర్లు ఉండగా 2018 మార్చిలో ఇది 9.77 మీటర్లకు పడిపోయింది. గత ఏడాది మార్చితో పోల్చితే 0.33 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గింది. బిక్కవోలు, గండేపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట, కిర్లంపూడి, కోరుకొండ, రాజానగరం, రావులపాలెం, పెదపూడి, కడియం, కాకినాడ, అయినవిల్లి తదితర మండలాల్లో భూగర్భజల మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి.
గతంలో పోల్చితే ఈ ఏడాది వర్షపాతం 24 శాతం తగ్గడం తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. అలాగే పట్టణీకరణ పెరుగుతుండడంతో గ్రామాల్లో వ్యవసాయ భూములు ఎక్కువ సంఖ్యలో లేఅవుట్లుగా మారుతున్నాయని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సాగు తగ్గి భూగర్భజలాలు ఇంకిపోయే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీనికితోడు మెట్ట ప్రాంతాల్లో కాలువల నీటి కంటే బోర్ల నీటిపై ఆధారపడి సాగు చేయడం, డిమాండ్‌కు మించి పంపింగ్‌ చేయడం వల్ల కూడా భూగర్భ జలాలపై ప్రభావం చూపుతోందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో అవసరాలకు మించి పంపింగ్‌ చేయడం, ఆ మేరకు రీఛార్జి చేసే అవకాశాలు లేకపోవడం వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయని వివరించారు.బిక్కవోలు మండలం భలభద్రపురం-1లో 2017 మార్చిలో 5.671 మీటర్ల లోతున నీటిమట్టం ఉండగా ఈ ఏడాది మార్చిలో 7.421 మీటర్ల దిగువకు చేరింది. భలభద్రపురం-3లో గత మార్చిలో 23.39 మీటర్ల లోతున ఉన్న నీటి మట్టం ఈ ఏడాది మార్చిలో 25.467 మీటర్లకు పడిపోయింది. బిక్కవోలులో గత ఏడాది మార్చిలో 4.456 మీటర్ల లోతున నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 5.55 మీటర్లకు పడిపోయింది. గండేపల్లి పరిధిలో గత మార్చిలో 66.92 మీటర్ల లోతున నీటిమట్టం ఉండగా ఇప్పుడు 68.941 మీటర్లకు చేరింది.
గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో గత మార్చిలో 23.41 మీటర్లు ఉండగా ప్రస్తుతం 24.539 మీటర్లకు తగ్గింది. జగ్గంపేట పరిధిలో గత ఏడాది మార్చిలో 23.401 మీటర్ల లోతున ఉన్న నీటిమట్టం ఈ ఏడాది మార్చికి 25.55 మీటర్లకు పడిపోయింది. కిర్లంపూడిలో గత ఏడాది మార్చిలో 5.564 మీటర్ల లోతున ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 6.629 మీటర్లకు పడిపోయింది. కోరుకొండలో గత ఏడాది మార్చిలో 1.318 మీటర్ల లోతున ఉండగా ప్రస్తుతం 3.905 మీటర్ల దిగువకు చేరింది. రాజానగరం పరిధిలోని సంపత్‌నగర్‌ గ్రామంలో గత ఏడాది మార్చిలో 20.905 మీటర్ల లోతున ఉండగా ప్రస్తుతం 23.108 మీటర్లకు తగ్గింది. రావులపాలెం పరిధిలోని గోపాలపురం వద్ద గత మార్చిలో 8.985 మీటర్ల లోతున ఉండగా ప్రస్తుతం 10.031 మీటర్లకు పడిపోయింది.జిల్లాలో సగటు నీటిమట్టం గత ఏడాది మార్చిలో 9.44 మీటర్లు కాగా ప్రస్తుతం 9.77గా నమోదైంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20721
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author