మసకబారుతున్న మాల్స్..

మసకబారుతున్న మాల్స్..
November 27 12:04 2018

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నట్లు కర్నూలువాసులు అంటున్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్ ద్వారా 
ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలన్నది సర్కార్ ధ్యేయం. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ మాల్స్ లో వ్యాపారం చెప్పుకోతగ్గ స్థాయిలో లేదని పలువురు అంటున్నారు. రెండు నెలలుగా 
ఈ మాల్స్‌ మూతపడ్డాయని చెప్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లభించే ధరలతో పోలిస్తే మాల్స్ ఎక్కువ ధరలు ఉంటున్నాయని స్థానికులు కొందరు అంటున్నారు. కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్లే 
కొనుగోలుదారులు ఇక్కడ సరకులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారం అంతంత మాత్రంగా ఉండటం, 60 రోజులుగా ఒప్పందం కుదుర్చుకున్న కార్పొరేట్‌ సంస్ద్థ 
సరకులను సరఫరా చేయకపోవడం సమస్యలను రెట్టింపు చేసింది. ఈ కారణాలతోనే విలేజి మాల్స్‌ మూతపడినట్లు డీలర్లు చెప్తున్నారు. జిల్లాలో పెద్ద పెద్ద సంస్థల మాల్స్ తో ప్రభుత్వ మాల్స్‌ పోటీ పడలేకపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విలేజ్ మాల్స్ కు సరకులను సరఫరా చేసే సంస్థ కొత్తవాటిని సరఫరా 
చేయాల్సింది పోయి ఉన్న సరకులను తీసుకెళ్లిపోయింది. దీంతో విలేజ్‌ మాల్స్‌ను నిర్వహిస్తున్న డీలర్లు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రారంభంలో 8 శాతం కమీషన్‌ వస్తుందని చెప్పడంతో 
పలువురు డీలర్లు మాల్స్‌ను ప్రారంభించారు. తీరా ప్రారంభించిన తర్వాత మీరే బకాయి పడ్డారని సరకు రవాణా చేసే సంస్థ అంటోందని సదరు డీలర్లు వాపోతున్నారు. బకాయిలు వెంటనే 
చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి నిత్యావసర ధరలు పెరిగిన రోజులివి. రూపాయి తగ్గినా వినియోగదారులకు ఊరట లభిస్తోంది. అయితే.. బయటి మార్కెట్ 
కంటే.. విలేజ్ మాల్స్ లో ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇక్కడ సరకులు కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ సమస్యపై సంబంధిత అధికార యంత్రాంగం దృష్టి 
సారించి చంద్రన్న విలేజ్ మాల్స్ కు ఆదరణ లభించేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ————————— 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20973
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author