ఆదర్శ కేంద్రాలతో అవగాహన

ఆదర్శ కేంద్రాలతో అవగాహన
November 27 12:15 2018

తెలంగాణలో ఓటర్లంతా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతస్థాయిలో నిర్వహిస్తోంది. ఓటు 
వజ్రాయుధమని, సమాజానికి సమర్ధవంతమైన పాలకులను అందించే బ్రహ్మాస్తమని సంబంధిత అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆదర్శ కేంద్రాలు సైతం ఏర్పాటు చేసి ఓటు విలువను 
ప్రజలకు వివరిస్తున్నారు. ఓటుహక్కుపై ఎంతగా ప్రచారం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ నమోదుకావడంలేదు. పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. 
అయితే ఈ అనాసక్తి, నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది. మంచి నేతలు పాలనాపగ్గాలు స్వీకరించాలంటే ప్రజలంతా ఓటుహక్కును వినియోగించుకోవాల్సిందే. ఒకసారి గెలిచిన అభ్యర్ధి ఐదేళ్లు పదవిలో 
ఉంటారు. ఈ నేపథ్యంలో సమర్ధవంతమైన నేతలను చట్టసభలకు పంపాల్సిన గురుతర బాధ్యత ఓటర్లపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే నాగర్‌కర్నూల్ జిల్లాలో గతేడాది తక్కువ ఓటింగ్ నమోదైన 
కేంద్రాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సదరు ప్రాంతాల్లో ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఆదర్శ కేంద్రాలు ఏర్పాటుచేశారు.గత నెల నుంచే ఓటరు హక్కు వినియోగంపై ఎన్నికల సిబ్బంది ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ప్రతీచోటా ప్రచారం పూర్తి కావస్త్తోంది. కళా బృందాలతో ఓటు విలువను తెలియజేసే కార్యక్రమాలు, 
కళాశాల విద్యార్థులకు నమూనా పోలింగ్‌ నిర్వహించే పద్ధతులు, పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో హోర్డ్డింగ్‌లను ఏర్పాటు చేసి బహుముఖ ప్రచారాన్ని కల్పించారు. నాగర్‌కర్నూల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 
829218. ఓటర్ల సంఖ్యను బట్టి 1032 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇక మోడల్ కేంద్రాలు 4 అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మూడు జిల్లాలు మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, 
వనపర్తిల్లోనూ ఓటర్లకు అవగాహన కల్పించే మోడల్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో నూరుశాతం ఓటింగ్ నమోదు కావాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతేడాది 
తక్కువ ఓటింగ్ జరిగిన సెంటర్లను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ఓటర్లంతా తప్పనిసరిగా తమ ఓటుహక్కును 
వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.————————— 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20987
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author