సాగుతున్న పనులు..

సాగుతున్న పనులు..
November 27 16:13 2018

గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులున్నా, సదరు వెల్ఫేర్ 
హాస్టల్స్ లో పనులు నత్తనడకన సాగుతుండడంపై విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయిల విలువైన పనులు సాగదీత ధోరణితో చేస్తుండటంతో నానాపాట్లు పడాల్సి వస్తోందని 
ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం పనులు మంజూరు చేసినా, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఉదాసీనత ఉంటోంది. దీనివల్లే పనులు ఆలస్యమవుతున్నట్లు కొందరు 
వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉంటే అధికారుల వేతనాలు కూడా చెల్లించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి స్థానికంగా కొన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో తలుపులు, కిటికీలు, 
గోడలు, టాయిలెట్స్‌ మరమ్మతులు చేపట్టారు. తెనాలి డివిజన్‌లోని దుగ్గిరాల బాలుర వసతి గృహానికి రూ.4లక్షలు, బాలికల వసతి గృహానికి రూ.10లక్షలు కేటాయించారు. ఇక తెనాలి బాలుర 
వసతిగృహం-1కు రూ.12లక్షలు, బాలుర వసతిగృహం-2కు రూ.12.30లక్షలు నిధులను మంజూరు చేశారు. వెల్ఫేర్ హాస్టళ్లలో పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల ద్వారానే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఈ పనులు ఆగస్టులోనే ప్రారంభించారు. పనులు మొదలు పెట్టి చాలా రోజులు 
గడుస్తున్నా అవి కొలిక్కిరాకపోవడంపై విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సమస్యలతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని వాపోతున్నారు. తెనాలి నాజరుపేటలోని బాలుర వసతిగృహంలో 
తలుపులు, కిటీకీలు తొలగించారు. ఆ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో టైల్స్‌ వేయాల్సి ఉంది. అయితే గత కొద్దిరోజులుగా పనులు నిలిచిపోయినట్లు 
విద్యార్థులు చెబుతున్నారు. అయితే పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, ఎక్కడా నిలిపివేయలేదంటూ కాంట్రాక్టరు, వర్క్‌ సూపర్‌వైజర్‌ అంటున్నారు. ఏదేమైనా నిధులు ఉన్నప్పటికీ సంక్షేమ 
వసతి గృహాల్లో వివిధ నిర్మాణాలకు సంబంధించిన పనులు మందకొడిగానే సాగుతున్నాయి. ఈ సమస్యపై స్పందించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20998
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author