ఐదు రూపాయిలు ఉంటే ప్రధానిని కలవొచ్చు

ఐదు రూపాయిలు ఉంటే ప్రధానిని కలవొచ్చు
November 30 17:27 2018

దేశ ప్రధానిని కలవడమంటే మాటలా? దానికి ఎన్ని సిఫారసులు కావాలో కదా! అయితే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే మీ దగ్గర రూ.5 ఉంటే చాలు! ఎంచక్కా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవచ్చు. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు విరాళాలు సేకరించేందుకు బీజేపీ వినూత్న ప్రయోగం చేస్తోంది. ‘నమో యాప్’ ద్వారా ఇది సాధ్యం చేయనుంది. ఒక రిఫరల్ కోడ్ ద్వారా రూ. 5 నుంచి రూ.1,000 వరకు బీజేపీకి విరాళం ఇవ్వొచ్చు! ఇలా ఇచ్చిన వారికి ప్రధాని నరేంద్రమోదీని కలిసే అవకాశం కల్పిస్తారు ‘నమో’ యాప్‌లో ఈ మేరకు కొత్త ఫీచర్ జోడించారు. ఈ ఫీచర్ కింద రూ.5 నుంచి రూ.1000 వరకు చిన్న మొత్తాల్లో విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఓ రిఫరల్ కోడ్ వస్తుంది. దాతలు ఈ కోడ్‌ను ఈమెయిల్, ఎస్‌ఎస్‌ఎమ్ లేదా వాట్సాప్‌ల ద్వారా తమ మిత్రులకు దీన్ని పంపించాల్సి ఉంటుంది. ‘‘వందమంది ఈ రిఫరల్ కోడ్ ఉపయోగించడంగానీ, లేదా యాప్ ద్వారా విరాళం ఇచ్చేందుకు ఈ లింక్‌ను పంపడంగానీ జరిగితే… ఇలా ప్రోత్సహించిన వ్యక్తి ప్రధాని మోదీని కలుసుకునేందుకు అవకాశం పొందుతాడు…’’ అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజా ఫీచర్‌తో ప్రధాని మోదీకి, సామాన్య ప్రజలకు మధ్య మరింత అనుబంధం పెరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ రానివారికి మోదీ చిత్రాలు ఉన్న టీ షర్టులు, కాఫీ మగ్గులు ఇస్తారు. మరో వైపు తెలంగాణతోపాటు రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ప్రధాని నరేంద్ర మోదీ.. అటు దేశ దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడంలోనూ బిజీ బిజీగా ఉంటున్నారు. రాజస్థాన్‌లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ఆ వెంటనే అర్జెంటీనాలో జరగను న్న జీ 20 సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరివెళ్లారు. అంతర్జాతీయ సంబంధాల్లో అత్యంత ప్రాధాన్యంగా భావించే జీ20 సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి అగ్రరాజ్యం అమెరి కాతోపాటు చైనా, రష్యా, బ్రెజిల్ తదితర దేశాల అధినేతలు పాల్గొ నున్నారు. ఈ సందర్భంగా ట్రంప్, అబేలతో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన నున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో జపాన్-చైనా మధ్య తీవ్ర విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా, ప్రధాని మోదీ మాత్రం దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. అటు ప్రచారం.. ఇటు దౌత్యం రెండు విధాలుగా తీరిక లేకుండా ఉంటున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలోనూ ప్రధాని మోదీ మాల్దీవులు, సింగపూర్‌లో పర్య టించారు. ఫిన్‌టెక్, ఆసియాన్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇండియాకు రాగానే మళ్లీ రోజువారీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ దక్షిణ అమెరికాలోని అర్జెంటీ నాకు బుధవారం బయలుదేరారు. అక్కడ జీ 20 సమావేశంలో పాల్గొనున్నారు. నవంబరు 23 నుంచి చూస్తూ మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ప్రతి రోజూ ఆరురోజులుగా మోదీ ప్రచారంలో పాల్గొన్నారు. అర్జెంటీనాకు బయలుదేరే ముందు కూడా రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విశేషం. రాజస్థాన్‌లో రెండు ప్రచార సభల్లో పాల్గొనిఢిల్లీకి వచ్చిన 90 నిమిషాల్లోనే అర్జెంటీనాకు బయలుదేరేందుకు మోదీ సంసిద్ధమయ్యారని ఓ అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో హెలికాప్టర్‌లో రెం డు ప్రాంతాలకు వెళ్లారని, జైపూర్ నుంచి ఢిల్లీకి మళ్లీ ప్రత్యేక విమానంలో వచ్చారని, ఇలా ఒకే రోజు ఏడుగంటలపాటు ఆకాశయానం చేశారని తెలిపారు. గంటన్నరపాటు విశ్రాంతి తీసుకుని 25 గంటల పాటు ప్ర యాణం ఉండే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు పయణమయ్యా రని చెప్పారు. డిసెంబరు 3న తిరిగి ఢిల్లీకి వస్తారని, ఆ వెంటనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, తెలంగాణలో హైదరాబాద్‌లో నిర్వహించే ప్రచారంలో పాల్గొననున్నారు. ఇలా ప్రధాని మోదీ బిజీబిజీగా గడపనున్నారు.  

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21105
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author