5 నుంచి మద్యం షాపుల బంద్

5 నుంచి మద్యం షాపుల బంద్
December 02 12:30 2018

శాసన సభ ముందస్తు ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 7వ తేదీన జరగనున్న పోలింగ్‌ను పురస్కరించుకుని నగరంలోని మద్యం షాపులను 5వ తేదీ సాయంత్రం నుంచి ఏడో తేదీ సాయంత్రం వరకు మూసివేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, బార్లు కలిగిన రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, మిలిటరీ క్యాంటీన్‌లలో మద్యం అమ్మకాలు, రిజిస్టర్ క్లబ్‌లను మూసివేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా హైదరాబాద్, సికిందరాబాద్‌లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది గుమ్మికూడటాన్ని నిషేధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ సందర్భంగా ఓటు వేసే ఓటర్లు ఒకే వరస లైన్లలో వెళ్లి ఓట్లు వేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 10352 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. ఇప్పటి వరకు 1140 మందిపై కేసులు నమోదు చేసి, అందులో 918 మందిని అరెస్టు చేయటంతో పాటు 207 బెల్ట్‌షాపులను మూసివేశామని పేర్కొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21127
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author