తెలంగాణలో మాటల తూటాలు

తెలంగాణలో మాటల తూటాలు
December 03 15:55 2018

తెలంగాణ ఎన్నికల్లో మాటలు తుటాల్లా పేలిపోతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతుంది. పంచ్ డైలాగ్ లు పదేపదే కొడుతున్నారు నాయకులు. ప్రసంగాలు అదరగొడుతున్న వారిలో కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత గులాబీ పార్టీ తరపున ప్రత్యర్థులను తమ మాటల ద్వారా దడ దడ లాడిస్తున్నాయి. వీరి ధాటిని తట్టుకోవడానికి మహాకూటమి లోని స్టార్స్ అంతా ముప్పేట దాడి సాగిస్తున్నారుఇక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి విమర్శలు ఆరోపణల్లో ట్రెండింగ్ కొనసాగిస్తున్నారు. పిసిసి ఉత్తమకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క జోష్ మీద వున్నారు. ఇక కమలం తరపున ప్రధాని మోడీ, అమిత్ షా ఫ్రంట్ లైన్ లో వున్నారు. ఇక హాట్ కామెంట్స్ కి పెట్టింది పేరైన ఎంఐఎం అసద్ వుద్దీన్ ఒవైసి, అక్బర్ వుద్దీన్ ఒవైసీలు, టిడిపి తరపున చంద్రబాబు, బాలకృష్ణ దూసుకుపోతున్నారు. తెలంగాణ జనసమితి తరపున కోదండరాం ఒక్కరే పంచ్ లు విసురుతున్నారు.చరిత్ర చింపలేరు అంటూ బాలకృష్ణ, నన్ను రాకుండా ఎవరు ఆపేది నేనే తెలంగాణ సృష్టికర్త అంటూ చంద్రబాబు పంచ్ లు కొట్టారు. ఇక కెటిఆర్ దూకుడు మరింత పెంచారు. ఎపి రాజకీయాల్లో ఇక వేలుపెట్టక తప్పదన్న హాట్ కామెంట్స్ తో వేడి పుట్టించారు. బ్రీఫ్డ్ మీ అంటూ ఓటుకు నోటు కేసులో ఆ మాట నేను కాదని చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు అనలేదని సూటిగా ప్రశ్నించారు కెటిఆర్. ఇలా ప్రతి పార్టీ స్టార్స్ విసురుతున్న పంచ్ లతో తెలంగాణ ఓటర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21160
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author