ఆ 12 ఉంటే ఓటెయ్యచ్చు

ఆ 12 ఉంటే ఓటెయ్యచ్చు
December 06 14:31 2018

హైద్రాబాద్

తెలంగాణలో ఎన్నికల జోరు ఊపందుకుంది. ఇక జనం కూడా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఓటు ఎక్కడ వేయాలో కనుక్కుంటూ ఉన్నారు. అయితే ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డు(ఈపీఐసీ) లేని వాళ్లు తాము ఎలా ఓటు వేయాలో తెలియక ఆందోళనలో ఉన్నారు. ఇలాంటివారికి ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డు లేకపోయినా ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు.1. పాస్‌పోర్ట్2. డ్రైవింగ్ లైసెన్స్3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఐడెంటిటీ కార్డులు4. బ్యాంకు లేదా పోస్ట్‌ ఆఫీస్ పాస్‌బుక్స్(ఫోటో ఉండాలి)5. పాన్ కార్డ్6. ఎన్‌పీఆర్ ఆధ్వర్యంలో ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు7. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు8. కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్9. ఫోటోగ్రాఫ్‌తో పెన్షన్ డాక్యుమెంట్10. ఎన్నికల అధికారులు జారీ చేసిన అధికారిక ఫోటో ఓటర్ స్లిప్11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు12. ఆధార్ కార్డు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21291
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author