శ్రీశైలం వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

శ్రీశైలం వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ
October 03 22:45 2017
ఎగువ కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యామ్ కు రెండు రోజులుగా వరద నీరు భారీగా పోటెత్తింది. ఆంధ్ర, తెలంగాణ జిల్లాల జీవ నాడి అయిన శ్రీశైలం జలాశయంలో పూర్తి సామర్థ్యం నీరు  చేరింది. మరోవైపు సుంకేసుల డ్యాంకు వరదనీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. తుంగభద్రకు వరద నీరు చేరడంతో నది తీరాన ఉన్న గ్రామాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.
కర్నూలు జిల్లాతోపాటు ఎగువన కర్ణాటక పరిదిలో కురుస్తున్న వర్షాలకు సుంకేశుల జలాశయానికి  భారీ ఎత్తున వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.20  టీఎంసీల వరకు చేరింది. దీంతో సుంకేశుల బ్యారేజీ 4 క్రస్ట్‌ గేట్లు ఒక మీటరు చొప్పున ఎత్తి  శ్రీశైలం రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు. ఆరుతడి పంటల కోసం కేసీ కాల్వకు, కర్నూలు నగర తాగునీటి అవసరాలకు 2,534  క్యూసెక్కులు విడుదల చేశారు.  ఇటు శ్రీశైలంకు జూరాల నుంచి కూడా నీరు చేరడంతో… బ్యాక్ వాటర్ నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కింద నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీగా వరద నీరు రావడంతో తుంగభద్ర నది తీరాన ఉన్న గ్రామాల రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటు కేసి కెనాల్ కూడా నీటితో ప్రవహిస్తోండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితో జలాశయం  పూర్తీ స్థాయికి చేరుకోనుంది.  శ్రీశైలానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.  ఇన్ ఫ్లో.. 1,07,779 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో… 14,825 క్యూసెక్కులు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 885 అడుగులుండగా, ప్రస్తుతం 878 అడుగులకు చేరుకుంది. . జలాశయం పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం  174.88 టీఎంసీలుగా నమోదైంది. కాస్త ఆలస్యంగా అయినా డ్యాం నీటి మట్టం పూర్తీ స్థాయికి  చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో కనీస  నీటి నిల్వ 885 అడుగులు కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2137
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225