టీజేఎస్ దారెటు….

టీజేఎస్ దారెటు….
December 08 12:41 2018

హైద్రాబాద్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అందరి దృష్టి ఈ నెల 11న విడుదలయ్యే ఫలితాలపైనే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రజాకూటమిలో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగింది. వీటిలో నాలుగు అంబర్‌ పేట (నిజ్జన రమేష్‌), మల్కాజిగిరి (దిలీప్‌కుమార్‌), సిద్దిపేట (భవానీ రెడ్డి), వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ, మిగిలిన ఐదు దుబ్బాక (రాజ్‌కుమార్‌), వరంగల్‌ తూర్పు (గాదె ఇన్నయ్య), ఆసిఫాబాద్‌ (ఆత్రంసక్కు), మిర్యాలగూడ (విద్యాధర్‌రెడ్డి), మహబూబ్‌నగర్‌ (రాజేందర్‌రెడ్డి) స్థానాల్లో కాంగ్రెస్‌తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలిచింది. శుక్రవారం ఎన్నికలు ముగియడంతో మొత్తం స్థానాల్లో ఎంత మంది అభ్యర్థులు విజయం సాధిస్తారోనని ఆ పార్టీ లెక్కల్లో మునిగింది. వచ్చే ఐదేండ్లు మనుగడ సాగించాలంటే ఆ పార్టీ అభ్యర్థులు కనీసం నాలు గైదు స్థానాల్లో గెలవడం తప్పనిసరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు, జనగాం సీటును కోదండరామ్‌కు కేటాయించి ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ తమను మోసిం చేసిందని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. ఎనిమిది స్థానాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని అంటున్నారు. తాము 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే నాలుగింటిలో సొంతంగానూ, మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్‌తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలవాల్సి వచ్చిందని అంటున్నారు. ఏదిఏమైనా లగడపాటి జోస్యం నిజమవుతుందని.. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీజేఎస్‌ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21398
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author