తిమ్మాపురంలో ఓటింగ్ బాయ్ కాట్

తిమ్మాపురంలో ఓటింగ్ బాయ్ కాట్
December 08 13:12 2018

పాలమూరు

 ఓటు వేయకపోతే ఎందుకు వేయడం లేదు, సామాజిక బాధ్యత లేదా అని మాటలు తరచుగా వింటుంటాం. కానీ కొన్ని సందర్భాలలో గ్రామానికి గ్రామం మొత్తం తమ బాధను, నిరసనను ఇలా తెలిపారని కూడా భావించవచ్చు. సరిగ్గా అలాంటి ఘటనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురానికి చెందిన ఆదివాసులు ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు తిమ్మాపురానికి వెళ్లిన ప్రయోజనం లేకపోయింది. హామీలు నెరవేర్చని నేతలకు ఓటు వేయాల్సిన అవసరం లేదని తీర్మానం చేసుకున్నారు. తాము ఎవరికీ ఓటు వేయబోమని స్పష్టం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో తమ గ్రామం ఉందని, ఏ నేత తమను పట్టింకున్న పాపాన పోలేదంటూ తిమ్మాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21413
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author