డేరాలో ఒక్క రేప్ కుడా జరగలేదు : హనీప్రీత్

డేరాలో ఒక్క రేప్ కుడా జరగలేదు : హనీప్రీత్
October 03 22:56 2017
రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డెరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కోర్టు ముందు లొంగిపోతారని కథనాలు వచ్చాయి. ఈక్రమంలో ఆమె అన్యూహంగా రెండు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
గుర్మీత్కు జైలు శిక్ష ఖరారైన తరువాత పంజాబ్, హర్యానా, ఢిల్లిలలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింసాకాండ చెలరేగాయి. అప్పటినుంచి హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. హనీప్రీత్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లి కోర్టు కొట్టివేయడంతో ఆమె లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డెరా బాబాకు తనకు మధ్య ప్రవిత్ర అనుబంధం ఉందని, తన మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ మా గురించి చెప్తున్నదంతా అబద్ధమే. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనాని ప్రశ్నించింది. తండ్రి-కూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా?  ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని హనీప్రీత్ పేర్కొన్నారు. సినిమా స్టార్ అయ్యేందుకే తాను గుర్మీత్ శిష్యురాలిగా మారిందని వచ్చిన ఆరోపణలపై కంటతడిపెట్టుకుంది. గుర్మీత్ అమాయకుడని, ఆయనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళుతామని ఆమె చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, గుర్మీత్ విడుదల అవుతారని ఆమె అన్నారు. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తన మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించడానికి నిరాకరించింది. చివరకు డేరా క్యాంపస్‌లో ఒక్క మహిళపై కూడా అత్యాచారం జరగలేదని అన్నది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2146
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225