దొనకొండ వద్ద డ్రోన్

దొనకొండ వద్ద డ్రోన్
December 10 15:57 2018

విజయవాడ:

సంబంధించిన శిక్షణ, పరిశోధన కోసం ఒక సంస్థను దొనకొండ వద్ద ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డ్రోన్ ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. అమెరికా కేంద్రంగా ఎన్3ఎం సోలుషన్స్ సంస్థను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్.మహేష్- యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ సంయుక్తంగా రూపొందించిన లాంగ్ రేంజ్ డ్రోన్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ తో కలిసి ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ రూపొందించిన డ్రోన్ ఒకే సారి వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఏడున్నర గంటలపాటు నిరాఘాటంగా ప్రయాణించే ఈ డ్రోన్ వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించవచ్చని వెల్లడించారు. 15 కిలోల బరువుండే ఈ లాంగ్ రేంజ్ డ్రోన్ ద్వారా 25 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం ఉంటుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం తో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21470
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author