టీడీపీ పేదల పార్టీ : మాజీ మంత్రి పల్లె

టీడీపీ పేదల పార్టీ : మాజీ మంత్రి పల్లె
October 04 01:56 2017

అనంతపురం జిల్లా  పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ని తిప్పేపల్లి పంచాయతీలో మంగళవారం జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో  మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప,జడ్పిటిసి పిట్టా ఓబులరెడ్డి, ఎంపిపి ఇస్మాయిల్, అధికారులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు. ఉంట్లవారిపల్లి, జర్రికుంట్లపల్లి, మామిళ్ల కుంట్లపల్లి పంచాయతీలో ని వడ్డివారిపల్లి, తొట్లీపల్లి, ఎం.కొత్తపల్లి లో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్బంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం టీడీపీ కి రెండు కళ్లులాంటివని అన్నారు. పేద వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని అన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ , మైనారిటీ కుటుంబాల్లో పెళ్లి కాని యువతి,యువకులకు చంద్రన్న పెళ్లి కానుక, అలాగే,  చంద్రన్న బీమా ద్వారా రూ.15 ల తో సాధారణ మృతికి రూ.2 లక్షల ప్రమాద బీమా, ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షల బీమా మంజూరు, ప్రతి పేద వాడికి ఎన్టీఆర్ పక్కా గృహాలన్నీ పేదలకు కోసం ప్రవేశపెట్టినవేనని అన్నారు. ఎన్నికల్లో చెప్పింది చేస్తాం….టీడీపీ ది మాయ మాటలు చెప్పే పార్టీ కాదని అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2149
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225