అందరి చూపు…11 వైపు

అందరి చూపు…11 వైపు
December 10 16:42 2018

మీరు భ‌లే చెప్తారండీ… వాళ్లు ఎదురుచూడ‌క ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎదురుచూస్తారా అని అనుకుంటున్నారేమో. నిజ‌మేనండీ… 11వ తేదీ జ‌గ‌న్ త‌ల‌రాత తేలే రోజు. అందుకే అంద‌రికీ కంటే ఆరోజు కోసం వైఎస్ జ‌గ‌న్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. 11 వ తేదీ వ‌చ్చే ఫ‌లితాలు జ‌గ‌న్ -చంద్ర‌బాబుల 2019 వార్ ప‌రిస్థితుల‌ను వేడెక్కిస్తాయి. ఒక‌వేళ ప్ర‌జాకూట‌మి గెలిస్తే జాతీయ స్థాయిలో మోడీ బ‌ల‌హీన ప‌డ‌తాడు. ఏపీలో చంద్ర‌బాబు మ‌రింత పుంజుకుంటారు. జ‌గ‌న్ బాగా బ‌ల‌హీన ప‌డ‌తారు. వైఎస్ఆర్ పార్టీ మెల్ల‌గా ఖాళీ అవ‌డం మొద‌ల‌వుతుంది. చంద్ర‌బాబులో పెరిగే ఆత్మ‌విశ్వాసం వ‌ల్ల జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు, దాడిని టీడీపీ నేత‌లు ఉదృతం చేస్తారు. ఒకవేళ కూట‌మి ఓడిపోతే ఏపీలో చంద్ర‌బాబు పై ముప్పేట దాడి మొద‌ల‌వుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి చంద్ర‌బాబుకు ఇబ్బందులు మొద‌లువుతాయి. దానికోసమే జ‌గ‌న్ ఎదురుచూస్తారు. చంద్ర‌బాబును అష్ట‌దిగ్బంధ‌నం చేయ‌డానికే ఆంధ్రుడు అన్న‌ ఆత్మ‌గౌర‌వాన్ని చంపేసి, వైఎస్‌ని తిట్టిన‌వ‌న్నీ మ‌రిచిపోయి టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌గ‌న్ రెట్టించిన ఉత్సాహంతో చంద్ర‌బాబును తిడ‌తారు. తెలుగుదేశం శ్రేణులు కొంచెం బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉండొచ్చు. కాంగ్రెస్ చంద్ర‌బాబును బ్లేమ్ చేసే అవ‌కాశం కూడా ఉంటుంది.మరో వైపు డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఫలితాలకు ముందు రోజే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేశారని తెలుస్తోంది. మహాకూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి చెప్పిన సర్వేను చంద్రబాబు బలంగా నమ్మి.. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు రోజే కాంగ్రెస్‌‌తో కలిసి ఫ్రంట్‌‌లో భాగంగా మొదటి విజయం సాధించబోతున్నామని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు చెప్పుకోవడానికి సిద్ధమై పోయారు..రాజకీయాల్లో కీలకం కాబోతున్నానని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నానని.. ప్రధాని అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని గత కొద్దిరోజులుగా చంద్రబాబు పెద్ద హడావుడే చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు..? త్వరలోనే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా..? మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకుంటారు? అనే వ్యవహారాలేమీ తేలకముందే చంద్రబాబు ఇలా జాతీయస్థాయిలో హడావుడి చేయడం కాసింత అత్యుత్సాహమే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.తెలంగాణలో అన్నీ తానై చూసుకున్న కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియక ముందే ఇలా సమావేశాలు..ఫోన్లు అంటూ ఇలా హడావుడి చేస్తుండటం గమనార్హం. ఇప్పటి వరకూ ఎగ్జిట్స్ పోల్స్.. రేపొద్దున పోస్ట్ పోల్స్ సంగతి సరే.. డిసెంబర్ 11న అసలు లెక్క తేలబోతోంది కదా.. అప్పటి వరకూ బాబు కాస్త ఓపిక పట్టి ఆ తర్వాత ముందుకెళ్తే బాగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణ ఫలితాల్లో సీన్ రివర్స్ అయితే ఫ్రంట్‌‌ మాటెత్తుతారా..? లేకుంటే ఏపీలో అయినా పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21490
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author