ఆకట్టుకుంటున్న మహిళా వాహానాలు

ఆకట్టుకుంటున్న మహిళా వాహానాలు
December 11 14:21 2018

నెల్లూరు,
చిన్న  నగరాలకు మహిళల వాహానాలకు గిరాకి పెరిగింది. హిళలు, వద్ధులు అలాంటి వారిని దష్టిలో పెట్టుకొని వచ్చినవే యాక్టివా వెస్ఫా, జూపిటర్‌ మాస్ట్రో ప్లెజర్‌ వంటి వాహనాలు. ఇవి ఇప్పుడు అందరూ అవసరాలు తీరుస్తూ ప్రతి ఇంటా కోలువు తీరుతున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడానికి వాహనం తప్పనిసరి అయింది. దీనితో వాటి వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. అన్ని విధాలా అందరికీ సరిపోయే ఇటువంటి తేలికపాటి వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కారు ఉన్న ప్రతి ఇంట్లో ఇటువంటి వాహనాలు ఉండటం కొసమెరుపు.వయసుతో సంబంధం లేకుండా మహిళలు వద్ధులు సులభంగా నడిపేందుకు వీలుగా పలు కంపెనీలకు చెందిన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలు సెల్ఫ్‌ స్టార్ట్‌ సౌకర్యం, తక్కువ బరువు ఉండటంతో సులభ విధానాలతో నేర్చుకొని వీలుండటంతో గిరాకీ బాగా పెరుగుతుంది. ఇటీవల కాలంలో చింతలపూడి మండలంలో మహిళలు అధిక సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో బైకులు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం బైకులు కంటే తేలికపాటి వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. షో రూమ్‌లలో కూడా అధికంగా ఇటువంటి వాహనాలు ఎక్కువగా కనిపించడం గమనార్హం.తెలుగు, ఎరుపు, నీలం, పసుపు, నలుపు, కుంకుమ వర్ణాలతో తేలికపాటి వాహనాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి. భవంతులలో ఉండేవారు తెలుపు రంగును, బయట ఎక్కువగా తిరగాల్సిన వారు మిగతా వర్ణాలను ఇష్టపడుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21521
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author