సిద్ధమౌతున్న చంద్రన్న పథకం

సిద్ధమౌతున్న  చంద్రన్న పథకం
December 11 14:40 2018

ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందించే క్రిస్మస్, సంక్రాంతి కానుకలను ఈ ఏడాది కూడా పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 12లక్షల మంది రేషన్ కార్డుదారులు ఈ కానుకల ద్వారా లబ్దిపొందనున్నారు. సుమారు రూ.40 కోట్ల విలువ చేసే ఈ చంద్రన్న కానుకలను పగడ్బందీగా పంపిణీ చేసేందుకు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రజలు ఆనందంగా పండుగలు జరుపుకోవడానికి ప్రభుత్వ ప్రతీఏటా ఈ చంద్రన్న కానుకలను వివిధ వర్గాలకు క్రమం తప్పకుండా అందిస్తుంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా రేషన్ కార్డుదారులకు ఈ చంద్రన్న కానుకలను అందించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 12 లక్షల మంది కార్డుదాలకు ఈ చంద్రన్న కానుకలను ఉచితంగా ప్రభుత్వం చౌకధర డిపోల ద్వారా పంపీణీ చేయనున్నారు. ఈనెల 15నుండి 25వరకు క్రిస్మస్ కానుకలను చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. సంక్రాంతి కానుకకు సంబంధించి జనవరి 2నుండి జనవరి 16 వరకు చంద్రన్న కానుకలను అందించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. మొత్తం ఆరు వస్తువులతో కూడిన వివిధ రకాల సరుకులకు ఒక ప్రత్యేక సంచిలో కార్డుదారులకు అందించనున్నారు. ఈ చంద్రన్న కానుకలో భాగంగా ఒక కిలో గోధుమ పిండి, అరకిలో కంది పప్ప, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అరలీటరు పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలు క్రిస్మస్, సంక్రాంతిని జరుపుకునేందుకు వీలుగా సుమారు 500 రూపాయల విలువ చేసే వివిధ రకాల సరుకులను ఉచితంగా అందించనున్నారు. జిల్లాలోని కార్డుదారుల కోసం ఇప్పటికే ఈఏడాదికి సంబంధించి 1200 టన్నుల గోదుమ పిండి, 600 టనున్నల శనగప్పు, 600 టన్నుల బెల్లం, 600 కిలో లీటర్ల పామాయిల్, 150 కిలో లీటర్ల నెయ్యి అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సరుకు విలువ మొత్తం సుమారు 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2340 రేషన్ దుకాణాల ద్వారా ఈ కానుకలను ఒక కిట్ రూపంలో పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల 98 వేల 940 మంది అధికారికి కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చంద్రన్న కానుకలను ఉచితంగా అందించనుంది. పదిరోజుల పాటు ఈ చంద్రన్న కానుకలను పంపిణీ చేసేందుకు ఇప్పటికే సరుకులు జిల్లాకు చెరుకున్నాయి. ఇక్కడ నుండి రేషన్ షాపులకు వెళ్లాల్సి ఉంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21530
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author