తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లకు షాక్

తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లకు షాక్
December 11 15:36 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి 16,500 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు గద్వాలలో కాంగ్రెస్ నేత డీకే అరుణ సైతం ఓటమి చవిచూశారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేత గంపా గోవర్దన్ చేతిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పరాజయం పాలయ్యారు.మరోవైపు కూకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు 28,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కాగా, ఏఐఎంఐఎం పార్టీ తాజాగా మరో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. చార్మినార్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థి అహ్మద్ ఖాన్ 32,317 మెజారిటీతో, బహదూర్ పురాలో మౌజంఖాన్ తమ సమీప ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు. కాగా, మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నుంచి ఇప్పటికే 54 వేల  మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21554
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author