ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి

ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి
December 11 16:25 2018

తెలంగాణ వ్యాప్తంగా విజయ దుందుభి మోగింది.  ఈ విజయం కేసీఆర్ తో పాటు తెలంగాణ ప్రజల విజయం.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరో సారి నిలబెట్టారు.   95 సీట్లకు పైగా గెలిచి టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసిందని సిద్దిపేట లో విజయం సాధించిన హరిష్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం అయన ఎన్నికల ఫలితాలు రాగానే మీడియాతో మాట్లాడారు.  కూటమి విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసింది.   ఎన్ని రకాల కుట్రలు చేసినా ధర్మం గెలిచింది.   కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి.   కౌరవుల లాగా 100 మంది మా మీద పడ్డా చివరకు టీఆర్ఎస్ గెలిచింది.  కేసీఆర్ ఆనాడు తెలంగాణ తెచ్చాడు, నేడు టీఆర్ఎస్ పార్టీ ని గెలిపించాడు.   కేసీఆర్ పై కూటమి చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని అన్నారు.   సీఎం అభ్యర్థులను అని చెప్పుకునే హేమాహేమీలు మట్టి కరిచారు.   కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష.   కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి.   ఇది సిద్దిపేట ప్రజల విజయమని అయన అభివర్ణించారు.   ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిది.   ఊపిరి ఉన్నంత వరకు సేవ చేసి రుణం తీర్చుకుంటా.   సిద్దిపేట ప్రజలకు చర్మం వలచి చెప్పులు కట్టించినా తక్కువే.  రికార్డు మెజారిటీతో గెలిపించి చరిత్ర తిరగరాసారు.  అభివృద్దిలో నెంబర్ వన్, మెజారిటీలో కూడా నెంబర్ వన్… సిద్దిపేట పేరును ఢిల్లీకి తీసుకెళ్లారని అన్నారు.   సిద్దిపేట ప్రజలకే ఈ గెలుపు అంకితం.   వచ్చే 5 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యునిగా పని చేస్తా.   కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ తెలంగాణ ను మారుస్తాడని అయన అన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21568
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author