ఇకనైనా భాజపా ఆత్మ పరిశీలన చేసుకోవాలి హెచ్చరించిన శివసేన

ఇకనైనా భాజపా ఆత్మ పరిశీలన చేసుకోవాలి               హెచ్చరించిన శివసేన
December 11 17:20 2018

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భాజపాకు స్పష్టమైన సందేశాన్ని పంపాయని, ఇక ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మిత్రపక్షం శివసేన హెచ్చరించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలఫై శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ..భాజపా విజయ రథానికి అడ్డుకట్ట పడిందనే దానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ‘ఈ ఫలితాలు భాజపాకు స్పష్టమైన సందేశాన్ని అందించాయి. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని పార్లమెంటు భవనం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శివసేన మిత్రంపక్షంగా కొనసాగుతున్నా..భాజపా విధానాలను విమర్శించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. 2014లో మహారాష్ట్ర ఎన్నికల్లో విడివిడిగా పోటీపడినా తరవాత కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించినా మధ్యప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌, భాజపాల మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21582
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author