వారంలో సెట్స్ తేదీల ఖరారు మళ్లీ పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజులు

వారంలో సెట్స్ తేదీల ఖరారు మళ్లీ పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజులు
December 13 14:49 2018

రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించబోయే ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) నిర్వ హణపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) కసర త్తు ప్రారంభించింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం ఆ ప్రక్రి యను తాత్కాలికంగా ఆపింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికా రంలోకి రావడంతో సెట్స్‌ నిర్వహణ ప్రక్రియను ఉన్నత విద్యామండలి అధికారులు ప్రారంభించారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌, లాటరల్‌ ఎంట్రీలో ప్రవేశాలకు ఈసెట్‌, ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు ఐసెట్‌, లా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్‌, ఉపాధ్యాయ విద్య కోర్సులో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌, ఇంజినీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్‌, డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు పీఈసెట్‌ నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. పీఈసెట్‌ మినహా మిగతా సెట్‌లన్నీ ఆన్‌లైన్‌లోనే జరు గుతాయి. ఎంసెట్‌, ఈసెట్‌ నిర్వహణ బాధ్యత మళ్లీ జేఎన్టీయూ హైదరా బాద్‌కే అప్పగించే అవకాశ మున్నది. మిగతా సెట్‌లను ఓయూ, కేయూలకు అప్పగిస్తారు. ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌లకు కన్వీనర్లు మారే అవకాశమున్నది. జాతీయ స్థాయి లో జరిగే ప్రవేశ, పోటీ పరీక్షలు, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ప్రవేశ పరీక్ష ల తేదీలను బట్టి తెలంగా ణలో సెట్స్‌ తేదీలను ఖరారు చేస్తామన్నారు.రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2019-20) నుంచి వృత్తి విద్యాకోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. నిబంధనల ప్రకారం వృత్తి విద్యాకోర్సుల ఫీజులను మూడేండ్లకోసారి తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఖరారు చేస్తుంది. 2016-17లో ఖారారైన ఫీజులు 2018-19 విద్యాసం వత్సరం వరకు అమల్లో ఉంటాయి. దీంతో వచ్చే విద్యాసం వత్సరం నుంచి మూడెండ్ల వరకు వసూలు చేసే ఫీజులను టీఏఎఫ్‌ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం భర్తీ చేయలేదు. కె చంద్రశేఖర్‌రావు రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ను నియమించే అవకాశమున్నది. కానీ చైర్మెన్‌ నియామకం ఆలస్యమైతే ఫీజుల ఖరారుపై ప్రభావం పడనుంది. అందుకే టీఏఎఫ్‌ ఆర్సీ చైర్మెన్‌ లేకపోయినా పాత కమిటీకి ఇంకా అధికారాలు న్నాయి. దీంతో ఫీజుల ఖరారుకు సంబంధించి కాలేజీల నుంచి ఆదాయ, వ్యయాల వివరాలను సమర్పించేందుకు టీఏఎఫ్‌ఆర్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 2019, జనవరి చివరి వరకు కాలేజీ యాజమాన్యాల నుంచి ఆదాయ, వ్యయాల సమర్పణకు గడువు ఇచ్చే అవకాశ ముంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం టీఏఎఫ్‌ ఆర్సీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశమున్నది. వచ్చే విద్యాసంవత్సరం ఖరారయ్యే ఫీజులు 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల వరకు అమల్లో ఉంటాయి. యూజీసీ వేతనాలు పెరగడం, నిర్వహణ, ఇతర ఖర్చుల వల్ల ఇంజి నీరింగ్‌, ఇతర కోర్సులు నడపడం యాజమాన్యాలపై భారం పడిందని తెలుస్తున్నది. దీంతో ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు 20 శాతం పెరిగే అవకాశముందని సమాచారం. ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యాకోర్సుల కాలేజీ యాజమాన్యాలు సమర్పించే ఆదాయ, వ్యయాల ఆధారంగా టీఏఎఫ్‌ఆర్సీ సమగ్రంగా అధ్యయనం చేసి ఫీజులను ఖరారు చేస్తుంది. ఆ ఫీజులను ప్రభుత్వం ఆమోదిస్తుంది. గతంలో కొన్ని కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచలేదు. పాత ఫీజులనే కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆ కోర్సుల ఫీజులూ పెరిగే అవకాశమున్నట్టు తెలిసింది. ఇంజినీరింగ్‌ ఫీజులకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను పరిశీలించే అవకాశముంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ఫీజులను టీఏఎఫ్‌ఆర్సీ ఖరారు చేయనుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21666
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author