అంబేద్కర్ ‘స్మృతివనం’

అంబేద్కర్ ‘స్మృతివనం’
October 04 02:18 2017
ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినందుకున్న విశ్వమేధావి కీర్తి పెంచకపోయినా తగ్గించకుంటే అదే ఆ కారణజన్మునికి మనమిచ్చే నివాళి. గత ఏడాది ఇదే రోజు బాబా సాహెబ్ 125 వ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తైన విగ్రహాలు ఏర్పాటుచేస్తామని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇందుకోసం తెలంగాణా ప్రభుత్వం కొంచెం కసరత్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా అంబేద్కర్ స్మృతివనం పేరిట ఒక గ్రాఫిక్ డిజైన్ విడుదల చేసింది. మంచిదే, అయితే ఈ స్మృతివనం పదుగురు తిరుగాడే ప్రాంతంలో కాకుండా కొత్త రాజధానికి దూరంగా నిర్మించతలపెట్టింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ రాజ్యాంగ కర్తకు ‘ఊరి బయటే’ చోటుదక్కింది. ఊరవతల వెలివేసిన జీవితాల్లోని చీకట్లను రాజ్యాంగ బద్దంగా పారదోలిన బాబాసాహెబ్ విగ్రహాన్ని ఉరవతలే నిలబెట్టడం ఈ పాలకులకే చెల్లింది. ప్రపంచవ్యాప్తంగా భారీ శిలాప్రతిమలు నీటి మధ్యలోనే, ముంగిట్లోనే ఉండడం తెలిసిందే. ప్యారిస్ లోని ఈఫిల్ టవరైనా, ముంబైలో నిర్మించతల పెట్టిన పటేల్ విగ్రహమైనా లేదూ  హైదరాబాద్ లోని బుద్ధుని విగ్రహమైనా  వాటర్ బాడీస్ తో ఉండడం వల్లే వాటికి మరింత శోభ కలిగింది. అమరావతికి కూతవేటు దూరంలో కృష్ణా నది ఉన్నప్పటికీ, భౌద్ద క్షేత్రమైన ఈ ప్రాంగణంలో నూతన రాజధాని గవాక్షంగా  నిలవాల్సిన ‘ అంబేద్కర్ స్మృతివనం’ ఎక్కడో మారుమూలకు, రాజధాని ఊరిబయటకు నెట్టేయడం క్షంతవ్యం కాదు. రాజధానికి వచ్చే ప్రతి విదేశీ అథితి, పర్యాటకుడు విధిగా అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించే వీలు కలిగేలా స్థల ఎంపిక చేసిఉంటే, పెరిగేది రాష్ట్ర ప్రతిష్ట తప్ప ఆ మహనీయుని గౌరవం కాదు. ఎందుకంటే ఈ చర్యతో ఆయనకు ప్రభుత్వం కొత్తగా ఇచ్చేమిలేదు. అంత గౌరవం ఉంటే కొత్త అసెంబ్లీ భవనం, సచివాలయం ప్రాంగణంలో రాజ్యాంగ  రూపశిల్పిగా  గుర్తించి కనీసం ఒక ఫోటో అయినా పెట్టుండేది!
Attachments area
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2167
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225