తెలంగాణ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు అత్తపై అల్లుడు, బాబాయ్, అబ్బాయ్

తెలంగాణ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు అత్తపై అల్లుడు, బాబాయ్, అబ్బాయ్
December 13 14:52 2018

తెలంగాణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వివేకానంద తన సొంత బాబాయ్ శ్రీశైలం గౌడ్‌పై బరిలోకి దిగి గెలిచారు. గద్వాలలో డీకే అరుణపై ఆమె అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. అత్తపై అల్లుడు ఘన విజయం సాధించి వార్తల్లోకెక్కారు. ఇక సనత్ నగర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన శిష్యుడు కూన వెంకటేష్ గౌడ్ బరిలోకి దిగారు. తలసాని విజయం తర్వాత ఆయన అనుచరులు కూన ఇంటి వద్ద వీరంగం చేయగా.. తలసాని స్వయంగా తన ప్రత్యర్థి ఇంటికెళ్లి పరామర్శించడం గమనార్హం. ఇక స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి సింగపురం ఇందిర.. ఆయనకు వరసకు చెల్లెలు కావడం గమనార్హం. దీంతో ఈ స్థానంలోనూ పోటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ గుభాళించగా.. ఏకంగా నలుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన సీనియర్ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు సైతం పరాజయం పాలయ్యారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21670
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author