మన పాలకులు ఆర్ధిక శాస్త్ర ప్రవీణులు

October 04 02:27 2017

…చిత్రం ఏమంటే మన పాలకులు ఆర్ధిక శాస్త్ర ప్రవీణులు, ఆర్ధిక  శాస్త్రాన్ని ఆమూలాగ్రం అవపోసన పట్టినవాళ్ళమే అన్నట్టు ఫోజులిస్తారు. దేశంలోని మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటే ఎటువంటి ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చో? ఒక్క క్షణం కూడా ఆలోచించి ఆవైపు దృష్టి పెట్టారు.  ఒక మన తెలుగు రాష్ట్రాల్లోని దళిత ఆదివాసీ వర్గాల మానవ వనరులను పుష్కలంగా వాడుకోగలితే ఎంతటి సామాజిక అభివృద్ధి సాధించవచ్చో చూద్దాం. దళితుల ఆదివాసీల విషయమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే …వారి సమస్యలు ఎంతకాదనుకున్నా సామాజిక రుగ్మతలే. ఒక ఆర్ధికంగా, ఆరోగ్యాంగా ఎదుగుతున్న క్రమంలో దళితుల, ఆదివాసీల సమస్యలు ప్రతిబంధకంగా పంటికిందరాయి లాగా మారకూడదు. తెలుగు రాష్ట్రాల్లో దళిత, ఆదివాసీల జనాభా మూడుకోట్లు అంటే మొత్తం జనాభాలో 25%, వాళ్లలో మెజారిటీ  జనాభా ప్రధాన జీవనాధారం ‘ కూలి’ పనులే. వారిలో చిన్నచితక, సర్కారీ,ప్రయివేటు  ఉద్యోగాల్లో ఉండేవారు బహుస్వల్పం. గత రెండు దశాబ్దాలుగా పాలకులు ఆయా వర్గాల ఉద్యోగాల భర్తీ కానీ, బ్యాక్లాగ్ పోస్టులను ఉద్దేశ్యపూర్వకంగానే భర్తీ చేయలేదు. దళితులు, ఆదివాసీలపై వివక్షా పూరిత ధోరణితో వ్యవహరించి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసి తమ నైజాన్ని చాటుకున్నారు. దీనివల్ల ఒక్క వారిజీవితాలే కాదు స్థూల ఆర్ధిక ప్రగతి మందగించింది. ఉద్దాహరణకు ప్రభుత్వాలు  ఒక లక్షమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాయనుకుందాం. ఆ లక్ష కుటుంబాల తలసరి ఆదాయం, కొనుగోలు శక్తి రాత్రికి రాత్రే పెరిగిపోతుంది అంటే కుటుంబానికి ఐదు మంది ఉన్నారనుకున్నా ఐదు లక్షల జనాభాకు సంబంధించి విద్య, వైద్య తదితర అవసరాలు, జీవన విధానం మారిపోతుంది. ప్రభుత్వాలకు రేషన్ సరుకులు, సామాజిక పింఛన్లు అందించే భారం, బరువు తొలిగిపోతుంది.ఆ లక్ష కుటుంబాల ద్వారా పరోక్షంగా  మరో లక్ష కుటుంబాల ఆదాయం పై ప్రభావం చూపుతుంది. ఆయా సామాజిక స్థాయి పెరిగి, రుగ్మతలుఅధికమించే వీలుకలుగుతుంది. ఏటా  ఒక లక్ష కుటుంబాల  నైపుణ్యాన్ని సరైన రీతిలో మానవ వనరులను వినియోగించుకోగలితేనే ఇంతటి ప్రగతిని సాధించగలిగితే దశలవారీగా ఈ పాతిక శాతం జనాభాను ఆర్ధిక ప్రగతిలో భాగస్వామ్యం చేయగలితే ఒక్క పదేళ్లలో దళిత, ఆదివాసీలు సామాజిక రుగ్మత ఎన్నటికీ కాబోరు! …ఎటొచ్చి పాలకుల్లో ఆ దార్శినికత, ఔదార్యం ఉండాలి. దళితులు, ఆదివాసీలను’కూలీలుగా కాకుండా’ సమర్ధవంతమైన, ధృడమైన మానవ వనరుగా గుర్తించే ఆర్థిక కుశాగ్రబుద్ధి పాలకులకు ఉంటే చాలు!

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2181
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225