ఏ సమాజమైనా నిస్తేజంగా మారిపోతే

October 04 02:29 2017

….ఏ సమాజమైనా నిస్తేజంగా మారిపోతే ? ఆ సమాజం మృతమైనదే. ముఖ్యంగా చదువుకున్న మేధావి వర్గపు మౌనం ….ఎంత మాత్రం క్షమించరానిది..ఇప్పుడదే జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో ! రైతుల ఆత్మహత్యలు నిరాఘాటంగా జరుగుతున్నా, రైతుకూలీలు వలసలు పెరిగిపోతున్న పౌరసమాజంలోని ఏ ఒక్క మేధావి పెదవివిప్పడంలేదు. ఆడపడుచులమీద అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్న చదువుకున్న మేధావి వర్గం కానీ పౌరసమాజం కానీ కిమ్మనడం లేదు పై పెచ్చు తమకు సంబంధం లేని వ్యవహారంలా చోద్యం చూస్తుందే తప్ప స్పందించడం లేదు. ఇక బడుగు బలహీన వర్గాలపై జరిగే దాడులు, హత్యాకాండలు తమకు ఏమాత్రం పట్టదన్నట్టు వ్యవహరిస్తోంది!
అసలు ఏమైంది ఈ పౌరసమాజానికి, మేధావి వర్గానికి గతంలో హక్కుల సంఘాలుండేవి ! ఒక సంఘటనో దాడో జరిగినప్పుడు స్పందించేవి.. కొందరు మేధావులు, విద్యావంతులు, మరికొందరు స్థానిక పెద్దలతో ఒక బృందంగా ఏర్పడి నిజానిజాలు వెలుగులోకి తెచ్చి వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చేవి.కొండొకచో బాధితులకు బాసటగా నిలిచేవి.కొన్ని విమర్శలు ఉన్నా వాటి పని అవి చేసేవి. అప్పట్లో ప్రభుత్వాలు కూడా తక్షణం అంతో ఇంతో స్పందించేవి. మీడియాకూడా కొంతలో కొంత బాధితుల పక్షం వహించేవి. అయితే ఇప్పుడా వాతావరణం ఎక్కడా కానరావడం లేదు. ప్రభుత్వాల, మీడియా నైజం మారింది. ఇటువంటి తరుణంలో మరింత బాధ్యాతాయుతంగా ఉండాల్సిన మేధావి వర్గం, చదువుకున్న విద్యావంతులు- మొత్తంగా పౌర సమాజం మౌనం దాల్చడం ?  రేపటి భావి సమాజానికి చెడు సంకేతం. ఎవరి ఇల్లు తగలబడితే వారే ఆర్పుకోవాలనే ధోరణి ఎంతవరకు సబబో విద్యాధికులు ఆలోచించాలి? ఈ రోజు నేనైతే …రేపటి రోజు నువ్వెందుకు కాకూడదు !

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2183
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225