కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్న పోలవరం

కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్న పోలవరం
December 17 16:34 2018

నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. 23 గంటల్లో 16,368 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ 
పనులు పూర్తి చేసింది. దీంతో చైనా త్రీగోర్జెస్‌ ప్రాజెక్టు రికార్డును నవయుగ సంస్థ అధిగమించింది.స్పిల్‌వేలో 4,268 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌లో 12100 మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి 
చేసింది. శనివారం ఉదయం 8.45 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న 
విషయం తెలిసిందే. వాతవరణం అనుకూలించదని, ఈ రికార్డు కొన్ని రోజులు వాయిదా వేద్దాం అనుకున్నా, ఒక రోజు ముందే రంగంలోకి దిగి, ఈ రికార్డు సృష్టించారు. పోలవరం కాంక్రీటు పనులు 
మందకొడిగా సాగుతున్న తరుణంలో… రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే 
పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది.తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. అయితే ఈ రికార్డు ని 
జూన్ నెలలోనే పోలవరం అధిగమించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. మళ్ళీ పోయిన నెల 11వేల 289 క్యూబిక్ 
మీటర్లతో మరో రికార్డు నెలకొల్పింది. అయితే తన రికార్డును తానే, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు అధిగమించింది. చైనాలోని త్రీగోర్జెస్‌ రికార్డును కూడా అధిగమించారు. ఇదే స్థాయిలో కాంక్రీట్‌ 
పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు 
నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 
ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల అనుకున్న ప్రకారం, వచ్చే జూన్ నెలకు సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21910
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author