విశాఖలో పలు విమానాలు రద్దు

విశాఖలో పలు విమానాలు రద్దు
December 17 17:26 2018

విశాఖ ఎయిర్పోర్టులో ప్రయాణికుల పడిగాపులు పడుతున్నారు.  పెథాయ్ తుఫాను ఎఫెక్ట్ విమానాల రాకపోకలపై పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాను కారణంగా 
వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. 
 అలాగే చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి  తిరుగివెళ్లింది. మరోవైపు,  హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానాన్ని రద్దు చేసారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 
విమానాలు రద్దు అయినట్లు సమాచారం. దీంతో విశాఖ ఎయిర్పోర్టులో 700 మంది ప్రయాణికులు ప్రయాణాలు చేయకుండా ఆగిపోయారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21925
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author