ప్రేమ పేరుతో మోసం చేసి హత్య

ప్రేమ పేరుతో మోసం చేసి హత్య
December 17 18:50 2018

బాపట్ల మండలం , మూలపాలెం గ్రామానికి చెందిన దళిత యువతి బెజ్జం స్రవంతి ని ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేసిన రెడ్డి దురహంకారి ఆర్మీ ఉద్యోగి పిట్టు సుబ్బారెడ్డి ని హత్యానేరం క్రింద , Sc,St యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని
డిమాండ్ చేస్తూ 14-12-2018 న బాపట్ల లో బహుజన ఐక్య వేదిక ప్రెస్ మీట్ నిర్వహించింది. మూలపాలెం గ్రామంలో నిరుపేద వ్యవసాయ కూలీలైన బెజ్జం కోటేశ్వరరావు @జార్జి , నిర్మల కుమార్తె స్రవంతి (21) తెనాలి jMJ కాలేజీలో Bsc (cbz) పూర్తి చేసిన తర్వాత గుంటూరు లేడీస్ హాస్టల్ లో వుంటూ బ్యాంకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుంది , డిగ్రీ చదివే సమయంలో సుబ్బారెడ్డి తన చెల్లెలు దగ్గరకు వెళుతూ , స్రవంతి తో పరిచయం ఏర్పరచుకొని , ప్రేమ , పెళ్ళి పేరుతో వశపరచుకొన్నాడు. ఆర్మీ లో ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే పెళ్ళి సంబంధం చూస్తున్న సుబ్బారెడ్డి నితేది7-12-18న తన స్వగ్రామం దుండివారిపాలెం ( కర్లపాలెం మండలం ) వె ళ్ళి నన్ను మోసం చెయ్యడం తగదని స్రవంతి నిలదీసింది.దీంతోరెచ్చిపోయిన సుబ్బారెడ్డి బంధువులు “మాల దానితో పెళ్ళేందిరా ” అంటూ స్రవంతి పై భౌతిక దాడికి పాల్పడ్డారు.స్ప్రుహ తప్పి పడిపోయిన స్రవంతి ని బిడారుదిబ్బలోని Rmp డాక్టర్ దగ్గర చూపించి తర్వాత ఆమెని గుంటూరు పంపించారు . సుబ్బారెడ్డి తన మోసం బయట పడుతుందని గ్రహించి పెళ్లి చేసుకుందాం రమ్మని స్రవంతి ని మరలా మరుసటి రోజు రప్పించి కిరాతకంగా హత్య చేసి శవాన్ని న్యూ గుంటూరు రైల్వే ట్రాక్ పై పడేసి ఆత్మ హత్య చేసుకుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు . స్రవంతి శరీరంలో గాయాలు వున్నాయి . తను వాడే స్మార్ట్ ఫోన్ కాకుండా అదే సిమ్ తో వేరే ఫోన్ శవం పక్కన వేశారు . పథకం ప్రకారం చేసిన స్రవంతి హత్య లో అనేక కోణాలు బయట కు రావాలంటే పోలీసులు నిజాయితీ గా దర్యాప్తు చేయాలి . నిందితులపై హత్యా నేరం తో పాటు ఎస్సీ .ఎస్టీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలి , సుబ్బారెడ్డి ని ఆర్మీ ఉద్యోగం నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలి , బెజ్జం స్రవంతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి , మొత్తం సంఘటన పై జిల్లా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాపిత ఉద్యమం చేపట్టాలని బహుజన ఐక్యవేదిక నిర్ణయించింది . ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మోహన్ కుమార్ ధర్మ . బి.ఎస్.పి. నాయకుడు చేగూడి బాబురావు .బి.టి.ఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గడ్డం ఏలియా .డాక్టర్ అంబేడ్కర్ సేవా సమాజం మాజీ గౌరవాధ్యక్షుడు జెట్టి జోసఫ్. ఎరుకల కుర్రు మహిళా నేత ఉమా. అంబేడ్కర్ రీసెర్చి వింగ్ కన్వీనర్ అడే బుజ్జి. బహుజనకెరటాలు వ్యవస్థాపకుడు ఎస్,ఆర్.పల్నాటి . మూలపాలెం గ్రామస్థులు చంద్రశేఖర్. అనిల్. రామారావు ,నవరాజు.బాబురావు , స్రవంతి తండ్రి జార్జి.రాజు.శామ్యూల్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21946
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author