తల్లీబిజడ్డ క్షేమమేనా.! (తూర్పుగోదావరి)

తల్లీబిజడ్డ క్షేమమేనా.! (తూర్పుగోదావరి)
December 18 13:38 2018

 రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లీబిడ్డల విభాగంలో మాతా శిశుమరణాలు తగ్గడం లేదు. ఈ ఆసుపత్రిలో వారంలో ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. ప్రభుత్వ డాక్టర్లు తమ తప్పులేదని చేతులు దులుపుకొంటున్నా భారీ మూల్యం చెల్లించేది మాత్రం రోగులే. డబ్బులు పెట్టి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని ఎందరో ఈ ఆసుపత్రికి వస్తున్నా.. ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. ఒకే సారి సీనియర్‌ సిబ్బందిని బదిలీచేయడంతో గైనిక్‌ విభాగంలో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రోగులు పేర్కొంటున్నారు. గర్భిణులకు పరీక్షలు చేసే సమయం కూడా సిబ్బందికి ఉండడం లేదు. రోజుల  తరబడి పురుడుపోసుకునేందుకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రçసూతి విభాగంలో ప్రస్తుతం ఏడుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒక డాక్టర్‌ మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. మిగిలిన ఆరుగురు డాక్టర్లలో ఒకరు రాత్రి సమయాల్లో డ్యూటీ నిర్వహించేందుకు కేటాయించగా ఐదుగురు రోజు వారీ విధులు నిర్వహిస్తుంటారు. రోజుకు కనీసం 10 నుంచి 15 వరకు పురుళ్లు  పోయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో డాక్టర్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. వీటితోపాటు గర్భిణుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తి వారికి రక్తం ఎక్కించడంలో  జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో తల్లి గాని నవజాత శిశువుల గాని మృత్యువాత పడుతుండడం సర్వసాధారణమైంది.వైద్య విధాన పరిషత్‌లో సిబ్బంది బదిలీలు రోగుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిని బదిలీలు చేయడం వల్ల రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న 69 మందిని ఒకే సారి బదిలీలు చేయడం వల్ల పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా వైద్య సేవలు పొందేందుకు వస్తుంటారు. వీరితో పాటు రోజు సుమారు 600 మంది వరకు అవుట్‌ పేషంట్లు వస్తుంటారు. వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ పని చేసే నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్‌ అటెండెంట్, ఇద్దరు ఓటీలు, 15 మంది స్టాఫ్‌ నర్సులు, ఏడుగురు ట్రామా కేర్‌ సిబ్బంది, ఏడుగురు ఎంఎన్‌ఓలు, నలుగురు ఎఫ్‌ఎన్‌ఓలు, ఒక జేఎస్‌డబ్ల్యూ, జిల్లా కేడర్‌కు చెందిన 44 మంది, జోనల్‌ కేడర్‌కు చెందిన 25 మంది  మొత్తం 69 మంది సిబ్బంది బదిలీ అయ్యారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=21965
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author