బీజేపీకి కొత్త అధ్యక్షుడు రేసులో పరిపూర్ణనంద, బండి, ఆచారి

బీజేపీకి కొత్త అధ్యక్షుడు రేసులో పరిపూర్ణనంద, బండి, ఆచారి
December 18 17:15 2018

దాదాపు 100 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్న తెలంగాణ బీజేపీ.. ఇప్పుడు ‘ఆకులు’ పెట్టుకుంటోంది. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో మునిగిపోయింది. మొదట పార్టీ ఆఫీసులోని మూడో ఫ్లోర్లో కట్టిన కొత్త బాత్రూములే రాష్ట్రంలో పార్టీ ఓటమికి కారణమంటూ తొండి వాదన చేసిన కమలనాధులు.. ఇప్పుడిప్పుడే తేరుకుని.. కింకర్తవ్యం ఏమిటన్న ధ్యాసలో పడ్డారు. మోదీతో పాటు, ఉత్తరాది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా.. తెలంగాణలో ఒక్క రాజాసింగ్- గోషా మహల్ దక్కించుకోవడంపై విమర్శలొస్తున్నాయి. పార్టీకి పూర్తిగా కొత్త రంగు పులిమితే తప్ప తెలంగాణ గడ్డ మీద కోలుకోలేమన్నది అంతర్గత తీర్మానం. ఈ క్రమంలోనే.. రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ సీటుకు ఎసరొచ్చింది. ఆయన స్ట్రాటజీ వల్లే అసెంబ్లీలో పార్టీ స్కోర్ దారుణంగా పడిపోయిందన్న ఖరారు నేపథ్యంలో కొత్త సారథి కోసం వెతుకుతోంది బీజేపీ హైకమాండ్.ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న స్పిరిట్యువల్ ఫైర్‌బ్రాండ్ పరిపూర్ణానంద స్వామి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు అప్పజెబుతామన్న హామీతోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేద్దామన్న ఆలోచన కూడా జరిగింది. కానీ.. ఇప్పుడు సీన్ మారేసరికి.. కనీసం రాష్ట్ర అధ్యక్షుడిగా పరిపూర్ణానందకు అవకాశమిస్తే.. పార్టీకి కొత్త రంగు-హంగు దొరికినట్లవుతుందని.. తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లోగా తెలంగాణ బీజేపీ పుంజుకునే అవకాశం దక్కుతుందని హైకమాండ్ అంచనా.ఇటు.. కరీంనగర్లో గట్టిపోటీ ఇచ్చిన బండి సంజయ్, కల్వకుర్తిలో పోటీచేసిన ఆచారి వంటివారికి నాయకత్వం అప్పగించాలంటూ ఆయా కార్నర్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ.. హైకమాండ్ మాత్రం పరిపూర్ణానందకే ఓటేస్తుందని.. ఆయనకున్న ‘వెయిట్’ అటువంటిదని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా.. మరో వారం రోజుల్లోగా తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు ఖాయం!

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22065
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author