సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ రైతు సేవ సహకార సంఘం సమావేశంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గోన్నారు. అయన మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంక్ రైతు సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. రైతులకు ఈ బ్యాంకు మనది అనే అంత చేయూతనిస్తుంది. రాష్ట్రంలో 6 సహకార బ్యాంకులు ఉంటే వాటిలో రెండు మాత్రమే లాభాల్లో ఉపన్నాయి. వాటిలో మన దూళ్లిపాళ్ల సహకాల బ్యాంకు ఒకటని అన్నారు. రైతులు సైతం ఈ బ్యాంకు అభివృద్ధి చేయూతనివ్వడం జరుగుతుంది.బ్యాంకులు మనకు పాడి గేదెలు లాంటివి లోన్ తీసుకుని సకాలంలో చెల్లించాలి. ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పధకాలు పెట్టింది. రుణమాఫీ, రైతు రధాలు, భూ సార పరీక్ష, టార్భాల్ పట్టాలు, వ్యవసాయ పరికరాలు ఇలా ఎన్నో చేస్తుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది. రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలని అయన సూచించారు. రైతులు వ్యవసాయంలో నూతనంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలి. దేశంలోనే మొదటిసారి సత్తెనపల్లి మార్కెట్ యార్డు నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సలహలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రైతులు వేసిన ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు, నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాం అందుకే వ్యవసాయం అంటే శ్రద్ద అని అన్నారు. నకరీకల్లు వద్ద 6020కోట్లతో పెన్నా గోదావరి అనుసంధానం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రా బ్యాంకు గుంటూరు జిల్లాలో ఉన్న వాణిజ్య బ్యాంకులలో ప్రధాన మైంది. రైతులకు ఈ బ్యాంకు సబ్సిడీ, లోన్ రెండు ఇస్తుంది. ప్రభుత్వం పేదల కోసం ప్రవేశ పెడుతున్న కార్యక్రమాలకు బ్యాంకర్లు ఇబ్బంది పెట్టకూడదూ. బ్యాంకులు రైతులకు పెట్టే ఇబ్బందుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అయన అన్నారు.